IND vs PAK : క్రికెట్లో ఫార్మాట్ ఏదైనా సరే భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) మ్యాచ్‌కు ఉండే క్రేజ్ తెలిసిందే. వరల్డ్ కప్ వంటి ఐసీసీ టోర్నీల్లో అయితే దాయాదుల మ్యాచ్ రోజు స్టేడియాలు కిక్కిరిసిపోవాల్సిందే. అయితే.. ఆపరేషన్ సిందూర్ తర్వాతి ఇరుజట్ల మధ్య క్రికెట్ అనే మాటే కరువైంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేందుకు సిద్ధమవుతున్నారు క్రికెటర్లు. అవును.. త్వరలో జరుగబోయే ‘వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్’ (World Championship Of Legends) లీగ్‌లో వెటరన్ ఆటగాళ్లతో కూడిన ఇండియా ఛాంపియన్, పాకిస్థాన్ ఛాంపియన్ జట్లు తలపడనున్నాయి. దాంతో, మ్యాచ్ వేదిక ఎక్కడ? ఎప్పుడు మొదలవుతుంది? లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు ఫ్యాన్స్.
ఒకప్పుడు మైదానంలో కొదమ సింహాల వలె ‘నువ్వా నేనా’ అన్నట్టు ఎదురుపడిన పాక్, టీమిండియా క్రికెటర్లు ఇప్పుడు మరోసారి తమ పోరాటంతో ఫ్యాన్స్‌ను అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రతిష్ఠాత్మక వరల్డ్ ఛాంపియన్షిప్ లెజెండ్స్ లీగ్ రెండో సీజన్లో జూలై 20 ఆదివారం నాడు ఇంగ్లండ్ వేదికగా ఇండోపాక్ క్రికెట్ సమరం జరుగనుంది. బర్మింగ్హమ్లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానం ఈ ఉత్కంఠ పోరుకు వేదిక కానుంది.
India Champions 🇮🇳 are the Winners of World Championship of Legends 2024 💥
India beat Pakistan by 5 wickets in the Finals and chased down 157 Runs quite comfortably 👏🏻 #IndvsPakWCL2024 pic.twitter.com/2B3v0aTlhX
— Richard Kettleborough (@RichKettle07) July 13, 2024
మాజీ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్, సురేశ్ రైనా, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడులతో భారత జట్టు బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. వినయ్ కుమార్, అభిమన్యు మిథున్, సిద్ధార్ధ్ కౌల్, వరుణ్ అరుణ్‌లతో కూడిన పేస్ దళం కూడా బలంగానే కనిపిస్తోంది. ఇక వెటరన్లు హర్భజన్ సింగ్, పీయూష్ చావ్లాలు తమ స్పిన్‌తో పాక్ బ్యాటర్లను బోల్తా కొట్టించేందుకు సిద్ధమవుతున్నారు. భారత్, పాక్ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.
ఇండియా ఛాంపియన్స్ స్క్వాడ్ : యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, పీయూష్ చావ్లా, స్టువార్ట్ బిన్ని, వరుణ్ అరొన్, వినయ్ కుమార్, అభిమన్యు మిథున్, సిద్ధార్థ్ కౌల్, గుర్కీరత్ మాన్.
పాకిస్థాన్ ఛాంపియన్స్ : స్క్వాడ్ మహమ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్, షర్జీల్ ఖాన్, వాహబ్ రియాజ్, అసిఫ్ అలీ, షాహీద్ ఆఫ్రిది, కమ్రాన్ అక్మల్, అమిర్ యమిన్, సొహైల్ ఖాన్, సొహైల్ తన్వీర్.
The legends return!🎬
World Championship of Legends 2025 kicks off TODAY! 🏏🔥
Your cricketing icons are back in action, and it’s going to be EPIC! 💥📅 𝐉𝐮𝐥𝐲 𝟏𝟖 – 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟐
🔹 6 Legendary Teams:
👉 Australia Champions 🇦🇺
👉 England Champions 🏴
👉 India Champions 🇮🇳… pic.twitter.com/7qUjbxzqBc— CricTracker (@Cricketracker) July 18, 2025
పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ దాడికి ప్రతిచర్యగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. అక్కడి నుంచి ఇరుదేశాల బోర్డుల మధ్య మాటాముచ్చట లేదు. దాంతో.. భవిష్యత్‌లో దాయాదుల క్రికెట్ మ్యాచ్ చూడలేమా? అనే సందేహం అభిమానలకు తలెత్తింది. అయితే.. తటస్థ వేదికలపై మాత్రమే ఆడేందుకు ఇరు బోర్డులు అంగీకరించాయి.