బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 197 పరుగులకు ఆలౌటైంది. గురువారం రెండో రోజు ఆట మొదలుకాగా.. ఓవర్నైట్ స్కోర్ 156/4తో ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా బ్యాటర్లు మరో 40 రన్స్ మాత్రమే జోడించి ఆలౌటైయ్యారు. భారత్ బౌలర్లలో రవీంద్ర జడేజా 4, ఉమేశ్ యాదవ్ 3, అశ్విన్ 3 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 88 పరుగుల ఆధిక్యంలో ఉంది.
టీమ్ఇండియా 109 ఆలౌట్
ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి బుధవారం తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 109 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (60) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. లబుషేన్ (31), స్టీవ్ స్మిత్ (26) ఫర్వాలేదనిపించారు. మన బౌలర్లలో జడేజా 4 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 47 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Australia lose their last six wickets for only 11 runs!
Can India continue their momentum in the second innings?#WTC23 | #INDvAUS | 📝 https://t.co/FFaPxt9fIY pic.twitter.com/7TapXdeu5k
— ICC (@ICC) March 2, 2023