Vinesh Phogat | పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ ఫైనల్‌కు (Indian wrestler) చేరిన వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat)పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. 100 గ్రాములు అధిక బరువు కారణంగా ఆమెను డిస్క్వాలిఫై చేశారు. ఫైనల్ గేమ్‌కు కొద్ది క్షణాల ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం సర్వత్రా షాక్‌కు గురి చేసింది. ఈ అంశం ప్రస్తుతం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అనర్హత వేటు వెనుక ఏదో కుట్ర ఉందంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 100 గ్రాములు బరువు ఓ సమస్య కాదంటూ కొట్టిపారేస్తున్నారు.
మరోవైపు ఫొగాట్‌పై అనర్హత వేటు ప్రకటన వచ్చిన వెంటనే ప్రధాని మోదీ స్పందించారు. నువ్వో ఛాంపియన్ అంటూ వినేశ్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్ కూడా పెట్టారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం దీని వెనుక ఏదో కుట్ర ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు ఒలింపిక్స్ కమిటీతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంపై లోక్‌సభలో ప్రతిపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. వినేశ్ ఫొగాట్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఇండియా కూటమి పార్టీలకు చెందిన ఎంపీలంతా పార్లమెంట్ మకర ద్వారం వద్ద నిరసన చేపట్టారు.
#WATCH | Delhi | INDIA bloc MPs stage protest at Makar Dwar of Parliament seeking justice for wrestler Vinesh Phogat after disqualification from Paris Olympics pic.twitter.com/8qZ6GqjbeT
— ANI (@ANI) August 7, 2024
Also Read..
Vinesh Phogat | రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు.. లోక్‌సభలో ప్రకటన చేసిన కేంద్రం
Vinesh Phogat | తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన వినేశ్ ఫొగాట్..?