హోవ్: ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో యువ భారత్ అదిరిపోయే బోణీ కొట్టింది. శుక్రవారం జరిగిన తొలి పోరులో భారత అండర్-19 టీమ్ 6 వికెట్ల తేడాతో(156 బంతులు మిగిలుండగానే) ఘన విజయం సాధించింది.
ఇంగ్లండ్ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్య ఛేదనలో యువ భారత్ 24 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 178 స్కోరు చేసింది. వైభవ్ సూర్యవంశీ(19 బంతుల్లో 48, 3ఫోర్లు, 5సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో విజృంభించాడు. తొలుత ఇంగ్లండ్ 42.2 ఓవర్లలో 174 పరుగులకే కుప్పకూలింది. కనిష్క్(3/20) రాణించాడు.