టోక్యో : వచ్చే నెలలో జపాన్ ఆతిథ్యమివ్వనున్న ఆసియా క్రీడల్లో క్రికెట్ పోటీల షెడ్యూల్ విడుదలైంది. నేరుగా క్వార్టర్స్ నుంచి ఆడనున్న భారత పురుషుల, మహిళల జట్లు.. వరుసగా రెండో స్వర్ణంపై కన్నేశాయి. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 03 దాకా సాగే ఈ పోటీల్లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పురుషుల జట్టు.. సెప్టెంబర్ 28 నుంచి పసిడి వేటను ఆరంభించనుంది.
గ్రూప్-ఏలో (అఫ్గానిస్థాన్, జపాన్, నేపాల్) రెండో స్థానంలో నిలిచే జట్టుతో భారత్.. క్వార్టర్స్ మ్యాచ్ ఆడుతుంది. అక్టోబర్ 01న జరిగే తొలి సెమీస్‌లో దాయాదుల పోరు (భారత్, పాక్) ఉండే అవకాశముంది. మహిళల విభాగంలో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. సెప్టెంబర్ 18న జపాన్‌తో జరిగే మ్యాచ్‌తో టోర్నీని ప్రారంభిస్తుంది.