INDW vs SLW : పొట్టి సిరీస్‌లో శ్రీలంకను భారత జట్టు వైట్‌వాష్ చేసింది. హ్యాట్రిక్ విజయాలతో సిరీస్ గెలుపొందిన టీమిండియా.. చివరి మ్యాచులోనూ లంకను చిత్తుగా ఓడించింది. మంగళవారం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (68) విధ్వంసక ఆటతో చెలరేగి భారీ స్కోర్ అందించింది. పవర్ ప్లేలోనే రెండు వికెట్లు పడినా అమన్‌జోత్ కౌర్(21), అరుంధతి రెడ్డి(27)లు రాణించారు. 176 పరుగులు ఛేదనలో హాసిని పెరీరా(65), ఇమేశా దులానీ(50)లు పోరాడినా లంకను గెలిపించలేకపోయారు. ఐదుకు ఐదు మ్యాచుల్లో పర్యాటక జట్టును మట్టికరిపించిన హర్మన్‌ప్రీత్ సేన విశ్వవిజేతగా తొలి సిరీస్‌ను 5-0తో అందుకుంది.
స్వదేశంలో వన్డే ప్రపంచకప్ విజేతగా చరిత్ర సృష్టించిన భారత్ తొలి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. వరల్డ్ కప్ అందుకున్నాక ఇకపై విజయాన్ని, ట్రోఫీలను గెలవడం ఒక అలవాటుగా మార్చుకుంటాం అని చెప్పిన హర్మన్‌ప్రీత్ కౌర్ తొలి అడుగు ఘనంగా వేసింది. రెండేళ్ల క్రితం ఆసియా కప్ ఫైనల్లో ఓడించిన శ్రీలంకను వైట్‌వాష్ చేస్తూ పొట్టి సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా. ఐదో టీ20లో ఓపెనర్ షఫాలీ వర్మ(5) విఫలమైనా.. హర్మన్‌ప్రీత్ కౌర్(68) ఖతర్నాక్ అర్ధ శతకంతో జట్టుకు కొండంత స్కోర్ అందించింది. అనంతరం బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి లంక గెలుపు ఆశలపై నీళ్లు చల్లారు. . ఐదు మ్యాచ్‌ల పొట్టి సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేయడం ఇది మూడోసారి. 2019లో వెస్టిండీస్‌ను, 2024లో బంగ్లాదేశ్‌ను ఐదుకు ఐదు మ్యాచుల్లో ఓడించింది భారత్.
Wickets continue to tumble 🥳
Vaishnavi Sharma and Sree Charani with a couple of timber strikes \|/
Updates ▶️ https://t.co/E8eUdWSQXs#TeamIndia | #INDvSL | @IDFCFIRSTBank pic.twitter.com/9DpN9LxA1J
— BCCI Women (@BCCIWomen) December 30, 2025
చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలనున్న శ్రీలంకకు భంగపాటే ఎదురైంది. భారీ ఛేదన ఆరంభంలోనే చమరి ఆటపట్టు(2)ను డైవింగ్ క్యాచ్‌తో ఔట్ చేసిన దీప్తి శర్మ లంకకు షాకిచ్చింది. ఆ తర్వాత.. హాసిని పెరీరా(65), ఇమేశా దులానీ(50) దూకుడుగా ఆడారు. ఇద్దరూ స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోర్‌బోర్డును నడిపించారు. ముఖ్యంగా దులానీ కళాత్మక షాట్లతో అలరిస్తూ టీ20ల్లో తొలి అర్థ శతకం నమోదు చేసింది.
I.C.Y.M.I
Timber strikes x 2⃣
Vaishnavi Sharma 🤝 Sree Charani
Scorecard ▶️ https://t.co/E8eUdWSj7U#TeamIndia | #INDvSL | @IDFCFIRSTBank pic.twitter.com/IpqOMJEWau
— BCCI Women (@BCCIWomen) December 30, 2025
రెండో వికెట్‌కు 79 రన్స్ జోడించిన దులానీని అమన్‌జోత్ వెనక్కి పంపింది. ఆ తర్వాత.. హాసిని అర్ధ శతకం పూర్తి చేసుకుంది. చరణి ఓవర్లో వరుసగా 4,6 బాదిన తను నాలుగో బంతికి బౌల్డయ్యింది. స్నేహ్ రానా ఓవర్లో నుత్యంగన రనౌట్ కాగా.. డేంజరస్ హర్షిత సమరవిక్రమ(8) బౌండరీ వద్ద డియోల్ క్యాచ్ పట్టగా వెనుదిరిగింది. అంతే లంక ఓటమి ఖాయమైంది. చివరి ఓవర్లో 25 రన్స్ అవసరమవ్వగా లంక.. 160కే పరిమితమైంది.
పొట్టి సిరీస్ చివరి మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (68) విధ్వంసక ఆటతో చెలరేగింది. ఓపెనర్లు విఫలమైనా.. మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోర్ అందించింది. పవర్ ప్లేలోనే రెండు వికెట్లు పడిన వేళ క్రీజులోకి వచ్చిన హర్మన్‌ప్రీత్ భారీ షాట్లతో విరుచుకుపడింది. హర్లీన్ డియోల్, దీప్తి శర్మలు విఫలమైనా అమన్‌జోత్ కౌర్(21)తో కలిసి స్కోర్‌బోర్డును ఉరికించింది. ఆరో వికెట్‌కు 61 రన్స్ జోడించింది. ఆఖరి ఓవర్లో అరుంధతి రెడ్డి(27) మూడు ఫోర్లు, ఒక సిక్సర్ బాదగా భారత్ 175 పరుగులు చేసింది.