Asia Cup | షార్జా: అండర్-19 ఆసియా కప్‌లో యువ భారత్ బోణీ కొట్టింది. షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్.. 211 పరుగుల తేడాతో జపాన్ను చిత్తుచేసింది. కెప్టెన్ మహ్మద్ అమాన్ (122 నాటౌట్) అజేయ శతకానికి తోడు కార్తికేయ (57), అయూష్ (54) రాణించడంతో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. భారీ ఛేదనలో జపాన్.. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 128 పరుగులకే పరిమితమైంది. కెల్లి(50), చార్లెస్ (35) తప్ప మిగిలిన ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో హార్దిక్ రాజ్ (2/9), చేతన్‌శర్మ(2/14), కార్తికేయ(2/21) మెరిశారు.