INDW vs BANW : ప్రపంచ కప్‌లో చివరి లీగ్ మ్యాచ్ సైతం వర్షార్పణం అయింది. డీవై పాటిల్ స్టేడియంలో వరుణుడి దోబూచులాటతో.. పలు అంతరాయాల నడమ కొనసాగిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ చివరకు రద్దయ్యింది. టీమిండియా ఇన్నింగ్స్‌లో 8.4 ఓవర్లు పూర్తికాగానే మళ్లీ వర్షం కురవడం మొదలైంది. అప్పటికి 57-0తో పటిష్టంగా ఉన్న భారత జట్టు విజయానికి చేరువైంది. కానీ.. వర్షం తగ్గే సూచనలు కనిపించకపోవడంతో ఆటను రద్దు చేసి చెరొక పాయింట్ కేటాయించారు.
సెమీస్‌కు ముందు విజయంతో ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవాలనుకున్న భారత్‌కు వర్షం షాకిచ్చింది. టాస్కు ముందే వచ్చేసి మ్యాచ్ గమనంపై సందేహాలు రేకెత్తించిన వరుణుడు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌కు రెండు దఫాలు అడ్డుపడ్డాడు. దాంతో.. 27 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో రాధా యాదవ్ (3-30), శ్రీచరణి(2-23)లు తిప్పేయగా బంగ్లాదేశ్ 119కే పరిమితమైంది. అనంతరం డక్‌వర్త్ లూయిస్ ప్రకారం భారత జట్టు లక్ష్యాన్ని 126గా నిర్ణయించారు.
Smriti Mandhana 🤝 Amanjot Kaur
A solid 5⃣0⃣-run opening stand 👌
Updates ▶️ https://t.co/lkuocSlGGJ#TeamIndia | #WomenInBlue | #CWC25 | #INDvBAN | @mandhana_smriti pic.twitter.com/yCTrscO2WJ
— BCCI Women (@BCCIWomen) October 26, 2025
స్వల్ప ఛేదనలో నాలుగో ఓవర్లో గేర్ మార్చిన స్మృతి మంధాన(34 నాటౌట్) బంగ్లా స్పిన్నర్ నిశితా అక్తర్‌కు చుక్కలు చూపించింది. ఫ్రంట్‌ఫుట్, బ్యాక్‌ఫుట్ షాట్లు ఆడిన తను ఏకంగా నాలుగు ఫోర్లతో రెచ్చిపోయింది. మంధాన జోరుతో ఆ ఓవర్లో16 రన్స్ రాగా.. పవర్ ప్లే చివరి ఓవర్లోనూ బౌండరీ కొట్టడంతో స్కోర్ 38కి చేరింది. ప్రతీకా రావల్ గాయపడడంతో ఓపెనర్‌గా వచ్చిన అమన్‌జోత్ కౌర్(15 నాటౌట్) సైతం దూకుడుగా ఆడడంతో 9 ఓవర్లలో భారత్ వికెట్ కోల్పోకుండా 57 పరుగులు చేసింది.
చివరి లీగ్ మ్యాచ్‌లో భారత బౌలర్లు తడాఖా చూపించారు. డీవై పాటిల్ స్టేడియంలో వర్షం అంతరాయాల నడుమ
27 ఓవర్లకు కుదించిన పోరులో.. బంగ్లాదేశ్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. స్పిన్నర్ రాధా యాదవ్ (3-30), శ్రీ చరణి(2-23)లు
తిప్పేశారు. వీరిద్దరూ మిడిల్ ఓవర్లలో వికెట్ల వేటకు తెరతీయగా.. బంగ్లాదేశ్ 119 పరుగులకే పరిమితమైంది. బంగ్లా జట్టులో షర్మీన్ అక్తర్(36) టాప్ స్కోరర్‌గా నిలిచింది.