రిఫా: భారత మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) చరిత్రలో కొత్త అధ్యా యం. ఏషియా యూత్ గేమ్స్‌లో భారత యువ క్రీడాకారుడు వీర్ భాడు నవచరిత్ర నెలకొల్పాడు. ఈ క్రీడల్లో భాగంగా శుక్రవారం అతడు.. బాయ్స్ 80 కిలోల ఈవెంట్లో కాంస్యం నెగ్గాడు. థాయ్‌లాండ్‌కు చెందిన బరిస్రిపై రిఫరీల ఏకగ్రీవ నిర్ణయంతో పతకం కైవసం చేసుకున్నాడు. త ద్వారా ఈ టోర్నీ చరిత్రలో పతకం గెలిచిన తొలి భారత ఎంఎంఏ ఫైటర్‌గా చరిత్ర సృష్టించాడు.