WTC Final 2023 | భారత్, ఆసీస్ ఆటగాళ్ల చేతికి నల్ల బ్యాడ్జీలు.. కారణం ఏంటంటే..?
WTC Final 2023 : ఓవల్ స్టేడియం(Oval)లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్(WTC Final ) మ్యాచ్‌కు ముందు భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేతికి నల్ల బ్యాడ్జీలతో కనిపించారు. వీళ్లు ఇలా కనిపించడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే..? గత శుక్రవారం ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం(Odish Train Accident)లో మృతి...
WTC Final 2023 : ఓవల్ స్టేడియం(Oval)లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్(WTC Final ) మ్యాచ్‌కు ముందు భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేతికి నల్ల బ్యాడ్జీ(Black Badges)లతో కనిపించారు. జాతీయ గీతాలాపనకు వచ్చిన సమయంలో ఇరుజట్ల క్రికెటర్ల చేతికి నల్ల రిబ్బన్స్ ఉన్నాయి. వీళ్లు ఇలా కనిపించడానికి ఓ కారణం ఉంది.
అదేంటంటే..? గత శుక్రవారం ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం(Odish Train Accident)లో మృతి చెందిన వాళ్లకు నివాళిగా, అయినవాళ్లను కోల్పోయిన కుటుంబాలకు బాసటగా ఇరుజట్ల క్రికెటర్లు వీటిని ధరించారు. అంతేకాదు మ్యాచ్ ప్రారంభానికి ముందు భార్, ఆస్ట్రేలియా ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బంది, ఆధికారులు, అభిమానులు నిమిషం పాటు మౌనం పాటించారు.
The Indian Cricket Team will observe a moment of silence in memory of the victims of the Odisha train tragedy ahead of the start of play on Day 1 of the ICC World Test Championship final at The Oval.
The team mourns the deaths and offers its deepest condolences to the families… pic.twitter.com/mS04eWz2Ym
— BCCI (@BCCI) June 7, 2023
‘భారీ రైలు ప్రమాదంలో వందల మంది మృతి చెందడం పట్ల టీమిండియా విచారంలో ఉంది. ఈ ప్రమాదంలో తోబుట్టువులు, బంధువులు, స్నేహితులను కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాం ‘అని బీసీసీఐ(BCCI) ఒక ప్రకటనలో తెలిపింది. ఒడిశాలోని బాలాసోర్ వద్ద మూడు రైళ్లు ఢీ కొన్న సంఘటనలో 288 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు వెయ్యి మందికి పైగా గాయపడ్డారు.
సిరాజ్‌కు తొలి వికెట్
ప్రపంచం మొత్తం అసక్తిగా ఎదురుచూసిన డబ్ల్యూటీసీ ఫైనల్ ఈరోజు మొదలైంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బౌలింగ్ తీసుకుంది. పేసర్ షమీ తొలి ఓవర్ వేశాడు. ఆ తర్వాత సిరాజ్ ధాటికి ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో కీపర్ శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(0) డకౌటయ్యాడు. దాంతో, 2 పరుగుల వద్ద ఆసీస్ తొలి వికెట్ పడింది. భరత్ క్యాచ్ పట్టిన అనంతరం సిరాజ్‌తో సహా భారత ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు. లబుషేన్(), వార్నర్ క్రీజులో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

