కొపెన్‌హగెన్: ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ద్వయం సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్‌శెట్టి ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ పోరులో సాత్విక్, చిరాగ్ జోడీ 21-16, 21-9 ఆస్ట్రేలియా జంట కెన్నెత్ జో, మింగ్ చున్పై అలవోక విజయం సాధించింది.
30 నిమిషాల్లోనే ముగిసిన పోరులో ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ సాత్విక్, చిరాగ్ తమదైన దూకుడుతో వరుస గేముల్లో ప్రత్యర్థిని మట్టికరిపించారు. మరోవైపు మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీ జోడీ 21-18, 21-10తో చైనీస్ తైపీ జంట చాంగ్జింగ్, యాంగ్ చింగ్‌పై గెలిచి ముందంజ వేసింది.