జూనియర్ సైన్యమిదే

- అండర్-19 ప్రపంచకప్‌నకు భారత జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది వెస్టిండీస్ వేదికగా జరుగనున్న అండర్-19 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం జట్టును ప్రకటించింది. 17 మంది సభ్యులతో కూడిన ఈ బృందానికి ఢిల్లీ ఆటగాడు యశ్ ధుల్ సారథ్యం వహించనుండగా.. ఆంధ్ర ప్లేయర్ ఎస్కే రషీద్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరుగనున్న ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటుండగా.. దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, ఉగాండాతో కలిసి భారత్ గ్రూప్-‘బి’లో ఉంది. ఈ నెల 23 నుంచి యూఏఈలో జరుగనున్న అండర్-19 ఆసియా కప్ కోసం ప్రస్తుతం యువ భారత జట్టు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ అనంతరం మన కుర్రాళ్లు విండీస్‌కు పయనం కానున్నారు. ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్న హైదరాబాదీ పేసర్ రిషిత్ రెడ్డికి.. ప్రపంచకప్ స్టాండ్‌బై జాబితాలో చోటు దక్కింది.
భారత అండర్-19 జట్టు: యశ్ ధుల్ (కెప్టెన్), హర్నూర్ సింగ్, రఘువంశీ, ఎస్కే రషీద్, నిశాంత్, సిద్ధార్థ్ యాదవ్, గౌతమ్, దినేశ్, ఆరాధ్య యాదవ్, రాజ్ అంగద్, మానవ్ పరాఖ్, కౌశల్ తాంబే, హంగార్జెకర్, వాసు, విక్కీ ఓస్తాల్, రవి కుమార్, గర్వ్ సాంగ్వాన్
స్టాండ్ బై: రిషిత్ రెడ్డి, ఉదయ్ సహరన్, అన్ష్ గోశాయ్, అమృత్ రాజ్ ఉపాధ్యాయ్, సింగ్ రాథోడ్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

