దుబాయ్: వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 వరల్డ్ కప్‌లో దాయాదుల పోరు ఫిబ్రవరి 15న జరుగనున్నట్టు తెలుస్తున్నది. ఐసీసీతో పాటు ఆతిథ్య హక్కులు కల్గిన భారత్.. దీనిపై అధికారిక ప్రకటన చేయనప్పటికీ 15న కొలంబో వేదికగా టీమ్ఇండియా, పాకిస్థాన్ తలపడనున్నట్టు సమాచారం.
ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రెండు దేశాలు వేర్వేరు గ్రూపుల్లో ఉండనున్నాయని వా ర్తలు వచ్చినా.. భారత్, పాకిస్థాన్‌తో పాటు యూఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్ ఒకే గ్రూపులో ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.