ODI World Cup | వన్డే ప్రపంచ కప్ -2023 టోర్నీలో పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వరుసగా ఐదు మ్యాచ్లలో విజయం సాధించి 10 పాయింట్లతో భారత్ టాప్లో ఉంది.
హెన్రీ బౌలింగ్ లో జడేజా ఫోర్ కొట్టడంతో నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై భారత్ విజయం సాధించింది.
48వ ఓవర్ లో హెన్రీ వేసిన నాలుగో బంతిని బౌండరీ బాట పట్టించబోయిన కోహ్లీ నేరుగా ఫిలిప్స్ క్యాచ్ ఇవ్వడంతో పెవిలియన్ బాట పట్టాడు. దీంతో టీం ఇండియా ఆరు వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది. సచిన్ టెండూల్కర్ రికార్డ్ ను కోహ్లీ సమం చేస్తారన్న అభిమానుల ఆశలు అడియాసలయ్యాయి. ఔటయ్యే సమయానికి కోహ్లీ 95 పరుగులు చేశాడు.
బౌల్ట్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ తొలి బంతిని స్టాండ్స్ లోకి, మూడో బంతిని బౌండరీకి పంపాడు. అటుపై ఒక వైడ్, మరో సింగిల్ తీశాడు. జట్టు గెలవడానికి, సెంచరీలో సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేయడానికి కోహ్లీకి ఏడు పరుగులు కావాలి.
బౌల్ట్ వేసిన 45వ ఓవర్ లో మూడు సింగిల్స్ వచ్చాయి. భారత్ గెలవడానికి 30 బంతుల్లో 26 పరుగులు చేయాలి.
43వ ఓవర్ లో భారత్ కు నాలుగు పరుగులు వచ్చాయి. కోహ్లీ, రవీంద్ర జడేజా చెరో రెండు సింగిల్స్ తీశారు. మరోవైపు రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ ఆరో వికెట్ భాగస్వామ్యానికి 50 పరుగులు జత చేశారు.
42వ ఓవర్ లో రచిన్ రవీంద్ర వేసిన రెండో బంతిని రవీంద్ర జడేజా మిడ్ వికెట్స్ మీదుగా స్టాండ్స్ కు పంపాడు. మధ్యలో ఫీల్డర్ చాప్ మన్ క్యాచ్ పట్టడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. అటుపై జడేజా రెండు, కోహ్లీ ఒక సింగిల్ తీశారు. ఈ ఓవర్ లో తొమ్మిది పరుగులు వచ్చాయి.
మ్యాట్ హెన్రీ వేసిన 40 వ ఓవర్ లో భారత్ కు మూడు పరుగులు వచ్చాయి. మరో పది ఓవర్లలో భారత్ గెలవాలంటే 49 పరుగులు చేయాలి.
ఫిలిప్స్ వేసిన 39వ ఓవర్ లో భారత్ కు ఐదు పరుగులు వచ్చాయి. జడేజా మూడు, కోహ్లీ రెండు సింగిల్స్ తీశారు.
38 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. 38వ ఓవర్ లో ఫెర్గూసన్ వేసిన చివరి బంతిని ఫైన్ లెగ్ , డీప్ స్క్వేర్ లెగ్ మధ్య నుంచి బౌండరీ బాట పట్టించాడు. అంతకుముందు వైడ్ బంతితో మొత్తం ఈ ఓవర్ లో తొమ్మిది పరుగులు వచ్చాయి.
భారత్ బ్యాటర్లను కట్టడి చేసేందుకు కివీస్ పార్ట్ టైం బౌలర్ ఫిలిప్స్ ను తీసుకొచ్చింది. 37వ ఓవర్ లో ఫిలిప్స్ వేసిన తొలి బంతిని కోహ్లీ బౌండరీ బాట పట్టించాడు. అటుపై కోహ్లీ రెండు సింగిల్స్, జడేజా ఒక సింగిల్ తీశారు. దీంతో ఈ ఓవర్ లో భారత్ కు ఏడు పరుగులు వచ్చాయి.
35వ ఓవర్ లో భారత్ కు ఒక సింగిల్ మాత్రమే వచ్చింది. సాత్నర్ వేసిన తొలి బంతికి ఒక సింగిల్ తీశాడు విరాట్ కోహ్లీ. అప్పటికి జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది.
34వ ఓవర్ లో బౌల్ట్ వేసిన ఐదో బంతిని కవర్ మీదుగా ఔట్ సైడ్ పంపిన సూర్య కుమార్ సకాలంలో క్రీజ్ కు చేరుకోలేకపోవడంతో సాత్నార్, టామ్ లేథమ్ రనౌట్ చేశారు. దీంతో ఐదు వికెట్లు కోల్పోయిన భారత్ పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నది. అప్పటికి భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది.
33వ ఓవర్లో సాత్నార్ వేసిన చివరి బంతికి సింగిల్ పరుగుతో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
33వ ఓవర్ లో శాత్నర్ వేసిన తొలి బంతికి కేఎల్ రాహుల్ ఎల్బీ డబ్ల్యూ అయ్యాడు. దీంతో నాలుగో వికెట్ భాగస్వామ్యానికి కోహ్లీ-రాహుల్ జోడీని విడదీశారు. అవుటయ్యే సమయానికి రాహుల్ 27 పరుగులు చేశాడు. రాహుల్ ఔట్ కావడంతో భారత్ కష్టాల్లో చిక్కినట్లే కనిపిస్తున్నది.
32వ ఓవర్ ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్ లో చివరి బంతిని విరాట్ కోహ్లీ బౌండరీకి మళ్లించాడు. బ్యాట్ ఎడ్జ్ కు తాకి, కీపర్ కు కుడి వైపు నుంచి బౌండరీకి వెళ్లిపోయింది బంతి.
మూడు వికెట్లు కోల్పోవడంతో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడుతూ స్కోర్ పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. తద్వారా నాలుగో వికెట్ భాగస్వామ్యానికి 62 బంతుల్లో హాఫ్ సెంచరీ జత చేశారు.
31వ ఓవర్ లో రచిన్ రవీంద్ర వేసిన చివరి బంతిని కేఎల్ రాహుల్ బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా బౌండరీకి మళ్లించాడు.
30 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. 30వ ఓవర్ లో మ్యాట్ హెన్రీ వేసిన తొలి బంతిని కోహ్లీ.. ఎక్స్ ట్రా కవర్ అండ్ మిడ్ ఆఫ్ మధ్య బౌండరీకి పంపాడు. అటుపై కోహ్లీ, కేఎల్ రాహుల్ చెరో రెండు సింగిల్స్ తీశారు.
29వ ఓవర్లో రచిన్ రవీంద్ర వేసిన తొలి బంతిని విరాట్ కోహ్లీ స్టాండ్స్ లోకి పంపాడు. ఇన్ సైడ్ ఐట్ సైడ్ -ఔట్ కవర్ ఎక్స్ ట్రా కవర్ మీదుగా స్టాండ్స్ లోకి పంపాడు. మరో రెండు సింగిల్స్, రాహుల్ మరొక సింగిల్ తో 29వ ఓవర్ లో తొమ్మిది పరుగులు వచ్చాయి. దీంతో భారత్ మూడు వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది.
25 ఓవర్లు ముగిసే సమయానికి టీం ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. క్రీజ్ లో విరాట్ కోహ్లీ 24 పరుగులతో, కేఎల్ రాహుల్ 10 పరుగులతో ఆడుతున్నారు.
బౌల్ట్ చేతిలో శ్రేయాస్ అయ్యర్ ఔటయ్యాడు. 22వ ఓవర్ లో ట్రెంట్ బౌల్ట్ వేసిన మూడో బంతిని డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా పంపాడు శ్రేయాస్ అయ్యర్, కానీ అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న కాన్ వే ముందుకు దూసుకొచ్చి క్యాచ్ పట్టాడు. దీంతో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. అప్పటికి టీం ఇండియా స్కోర్ 128 పరుగులు
శుభ్ మన్ గిల్, రోహిత్ శర్మ ఔట్ కావడంతో బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ ఆచితూచి ఆడుతున్నారు. 21వ ఓవర్ ముగిసే సమయానికి మూడో వికెట్ భాగస్వామ్యానికి 51 పరుగులు జత చేశారు.
20 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. క్రీజ్ లో విరాట్ కోహ్లీ 20, శ్రేయాస్ అయ్యర్ 28 పరుగులతో ఆడుతున్నారు.
15 ఓవర్లు ముగిసే సమయానికి టీం ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది. క్రీజ్ లో విరాట్ కోహ్లీ ఆరు పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 13 పరుగులతో ఆడుతున్నారు. 15వ ఓవర్ లో షాత్నర్ వేసిన నాలుగో బంతిని బౌండరీకి పంపాడు. హెన్రీ పరుగు తీసినా ప్రయోజనం లేకపోయింది.
ఫెర్గూసన్ బౌలింగ్ లోనే మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ ఔటయ్యాడు. 14వ ఓవర్లో రెండో బంతిని ఓవర్ పాయింట్ మీదుగా పంపుదామని శుభ్ మన్ గిల్ ప్రయత్నించినా రివర్స్ లో వెళ్లిన బౌండరీ లైన్ వద్ద ఉన్న మిచెల్ చేతికి చిక్కింది. అప్పటికి ఆయన వ్యక్తిగత స్కోర్ 26 పరుగులు. టీం ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్ అదే ఓవర్ లో రెండు ఫోర్లతో మెరిపించాడు.
ఫెర్గూసన్ బౌలింగ్ లో భారత్ సారధి రోహిత్ ఔటయ్యాడు. 12 వ ఓవర్ తొలి బంతిని ఆడబోయి బౌల్డయి పెవిలియన్ దారి పట్టాడు. అంతకుముందు 11వ ఓవర్లో మిచెల్ హెన్రీ వేసిన ఐదో బంతిని స్లాగ్ స్వీప్ ఓవర్ మీదుగా స్టాండ్స్ లోకి పంపాడు. దీంతో టీం ఇండియా 71 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
భారత్ సారధి రోహిత్ శర్మ దూకుడుగా స్కోర్ పెంచడానికి ప్రయత్నిస్తున్నాడు. పదో ఓవర్ మ్యాట్ హెన్రీ బౌలింగ్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ కొట్టాడు. రెండో బంతిని బ్యాక్ స్క్వేర్ లెగ్ వైపు బౌండరీకి మళ్లించిన రోహిత్.. ఐదో బంతిని లాంగాఫ్ మీదుగా స్టాండ్స్ బాట పట్టించాడు. పది ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ 63 పరుగులు చేసింది.
రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ జోడీని విడదీసేందుకు న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాత్నర్ ను బరిలోకి దింపింది. అయినా దూకుడు ప్రదర్శిస్తూనే ఆచితూచి స్పందిస్తున్నారు రోహిత్ శర్మ.. శుభ్ మన్ గిల్.
ఎనిమిది ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ వికెట్ కోల్పోకుండా 52 పరుగులు చేసింది. ఎనిమిదో ఓవర్ లో నాలుగో బంతిని మిడ్ ఆన్, మిడ్ వికెట్ మధ్య నుంచి బౌండరీకి పంపాడు శుభ్ మన్ గిల్. ఎనిమిది ఓవర్లు ముగిసే సమయానికి శుభ్ మన్ గిల్ 24, రోహిత్ శర్మ 28 పరుగులతో క్రీజ్ లో ఆడుతున్నారు.
వన్డేల్లో శుభ్ మన్ గిల్ 2000 పరుగులు చేసిన బ్యాట్స్ మన్ గా నిలిచాడు. ఆయన ఈ మైలురాయిని 38 మ్యాచ్ ల్లోనే సాధించాడు. అంతకుముందు సౌతాఫ్రికా బ్యాట్స్ మన్ హషీం అమ్లా 40 మ్యాచ్ ల్లో ఈ రికార్డు సాధించాడు.
ఏడో ఓవర్లో ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో రెండు ఫోర్లు కొట్టాడు శుభ్ మన్ గిల్. మూడో బంతిని కవర్ అండ్ మిడాఫ్ మధ్య నుంచి బౌండరీకి పంపితే, నాలుగో బంతిని బ్యాక్ వర్డ్ పాయింట్ మీదుగా బౌండరీ దారి పట్టించాడు. మరో సింగిల్ తీసి రోహిత్ చాన్స్ ఇవ్వడంతో లెఫ్ట్ ఆఫ్ మిడాఫ్ కు బంతిని పంపి రెండు పరుగులు చేశాడు. దీంతో ఏడు ఓవర్లు ముగిసే సమయానికి టీం ఇండియా 48 పరుగులు చేసింది.
ఆరో ఓవర్లో మ్యాట్ హెన్రీ వేసిన ఐదో బంతిని మిడ్ వికెట్ కు రైటాఫ్ వైపుగా క్లిక్ చేసి బౌండరీకి మళ్లించాడు శుభ్ మన్ గిల్. దీంతో జట్టు స్కోర్ 36 పరుగులు.
ఐదు ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ ఒక వికెట్ కూడా కోల్పోకుండా 32 పరుగులు చేసింది. భారత్ సారధి రోహిత్ శర్మ రెండు సిక్స్ లు, మూడు ఫోర్లతో 20 బంతుల్లోనే 25 పరుగులతో, శుభ్ మన్ గిల్ ఏడు పరుగులతో క్రీజ్ లో కొనసాగుతున్నాడు. బౌల్ట్ బౌలింగ్ లో నాలుగో బంతిని బౌలర్ తల మీదుగానే స్టాండ్స్ లోకి పంపాడు రోహిత్ శర్మ.
4వ ఓవర్ లో మ్యాట్ హెన్రీ వేసిన చివరి బంతిని శుభ్ మన్ గిల్.. బ్యాక్ వర్డ్ పాయింట్, కవర్ పాయింట్ మధ్య నుంచి బౌండరీ బాట పట్టించాడు.
భారత్ సారధి రోహిత్ శర్మ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. మూడో ఓవర్ లో ట్రెంట్ బౌల్ట్ వేసిన చివరి బంతిని మిచెల్ కుడి వైపు స్లిప్ నుంచి బౌండరీ బాట పట్టించాడు. మూడు ఓవర్లు పూర్తయ్యే సరికి టీం ఇండియా 22 పరుగులు చేసింది.
రెండో ఓవర్ లో మ్యాట్ హెన్రీ వేసిన ఐదో బంతిని స్టాండ్స్ లోకి పంపిన రోహిత్ శర్మ.. చివరి బంతిని బౌండరీ బాట పట్టించాడు. అంతకుముందు శుభ్ మన్ గిల్ సింగిల్ తీయడంతో రెండో ఓవర్ లో 11 పరుగులు వచ్చాయి. ఐదో బంతిని మిడ్ లాంగాన్ మీదుగా స్టాండ్స్ లోకి పంపాడు రోహిత్. చివరి బంతిని బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ రీజియన్ ద్వారా బౌండరీకి బాదాడు.
274 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తొలి ఓవర్ లో నాలుగు పరుగులు చేసింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన రెండో బంతిని డీప్ స్క్వేర్ కట్ చేసి బౌండరీకి పంపాడు రోహిత్ శర్మ.
వన్ డౌన్ బ్యాట్స్ మన్ గా వచ్చిన డెరిల్ మిచెల్ ను చివరి ఓవర్ లో మహ్మద్ షమీ వేసిన ఐదో బంతిని ఓవర్ డీప్ మిడ్ వికెట్ మీదుగా స్టాండ్స్ లోకి పంపడానికి ప్రయత్నించాడు. కానీ విరాట్ కోహ్లీ మరోమారు అద్భుతమైన క్యాచ్ పట్టి మిచెల్ ఆట కట్టించాడు. దీంతో కివిస్ జట్టు స్కోర్ 273 /9. చివరి బంతిని ఆడిన బౌల్ట్ సింగిల్ తీయబోతుండగా, కేఎల్ రాహుల్ రనౌడ్ చేశాడు.
మిచెల్ షాత్నర్ ఔట్ కావడంతో వచ్చిన మ్యాట్ హెన్రీని 48వ ఓవర్ ఐదో బంతికి బౌల్డ్ చేసి పెవిలియన్ బాట పట్టించాడు మహ్మద్ షమీ.. మ్యాట్ హెన్రీ ఒక్క పరుగు కూడా చేయకుండానే డకౌట్ అయ్యాడు. దీంతో కివీస్ 8 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. 48వ ఓవర్ లో మహ్మద్ షమీ రెండు వికెట్లు తీశాడు.
మహ్మద్ షమీ వేసిన 48వ ఓవర్ లో నాలుగో బంతిని ఆడుతున్న మిచెల్ షాత్నర్ బౌల్డయ్యాడు. దీంతో న్యూజిలాండ్ ఏడో వికెట్ కోల్పోయింది. అప్పటికి జట్టు స్కోర్ 260 పరుగులు
47 ఓవర్లు ముగిసే సమయానికి న్యూజిలాండ్ ఆరు వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. 47వ ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా వేసిన చివరి బంతిని లెగ్ సైడ్ పంపినా.. విరాట్ కోహ్లీ పరుగుత తీసి.. ముందుకు డైవ్ చేసి క్యాచ్ పట్టాడు. దీంతో మార్క్ చాప్ మన్ పెవిలియన్ బాట పట్టాడు. అప్పటికి ఆయన వ్యక్తిగత స్కోర్ ఆరు పరుగులు మాత్రమే.
45 ఓవర్లు పూర్తయ్యే సరికి న్యూజిలాండ్ ఐదు వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. క్రీజ్ లో డెరిల్ మిచెల్ 110 పరుగులు, మార్క్ చాప్మన్ ఒక పరుగుతో కొనసాగుతున్నారు.
న్యూజిలాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 45వ ఓవర్ లో కుల్డీప్ యాదవ్ వేసిన రెండో బంతిని ఆడబోయిన ఫిలిప్స్ కవర్స్ లో ఉన్న రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. అప్పటికి ఫిలిప్స్ వ్యక్తిగత స్కోర్ 23 పరుగులు. కివీస్ ఐదు వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది.
43వ ఓవర్లో మహ్మద్ సిరాజ్ వేసిన తొలి బంతిని డీప్ బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా స్టాండ్స్ లోకి పంపాడు గ్లెన్ ఫిలిప్స్. తర్వాత ఫిలిప్స్ మూడు సింగిల్స్, మిచెల్ మూడు సింగిల్స్ చేయడంతో కివీస్ కు ఈ ఓవర్ లో 11 పరుగులు జత కలిశాయి. 44 ఓవర్లు ముగిసే సరికి కివీస్ నాలుగు వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది.
కివీస్ బ్యాటర్ డెరిల్ మిచెల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వంద బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఏడు ఫోర్లతో సెంచరీ చేశాడు. 41వ ఓవర్ లో జస్ప్రీత్ బుమ్రా వేసిన నాలుగో బంతిని సింగిల్ గా మల్చడంతో మిచెల్ సెంచరీ పూర్తయింది.
40వ ఓవర్ లో మహ్మద్ షమీ వేసిన బౌలింగ్ లో కివీస్ ఐదు సింగిల్స్ తీసింది. దీంతో జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 219 రుగులు చేసింది.
39 ఓవర్లకు న్యూజిలాండ్ నాలుగు వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ వేసిన 39వ ఓవర్ లో గ్లెన్ ఫిలిప్స్ మూడు సింగిల్, రెండు పరుగులు చేశాడు.
37వ ఓవర్ లో కుల్దీప్ యాదవ్ వేసిన ఐదో బంతికి కివీస్ సారధి టామ్ లాథమ్ ఎల్బీడబ్ల్యూ అయి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో న్యూజిలాండ్ నాలుగు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. అప్పటికి టామ్ లాథమ్ వ్యక్తిగత స్కోర్ ఐదు పరుగులు మాత్రమే. మూడు లెగ్ బైల రూపంలో మూడు సింగిల్స్ రాగా, కుల్దీప్ యాదవ్ వేసిన రెండో బంతిని బౌండరీకి పంపాడు మిచెల్.
జస్ప్రీత్ బుమ్రా వేసిన 36వ ఓవర్ లో మిచెల్ రెండు ఫోర్లు కొట్టాడు. రెండో బంతిని సర్కిల్ లోని మిడ్ ఆఫ్ మీదుగా బౌండరీ బాట పట్టించాడు. నాలుగో బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా పంపి రెండు పరుగులు చేశాడు. లో ఫుల్ టాస్ గా వచ్చిన బంతిని చిన్నగా ఫ్లిక్ చేసి బౌండరీ బాట పట్టించాడు. దీంతో ఈ ఓవర్ లో కివీస్ కు 10 పరుగులు వచ్చాయి. 36 ఓవర్లలో కివీస్ మూడు వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది.
35 ఓవర్లు పూర్తయ్యే సరికి న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. 35వ ఓవర్ లో కుల్దీప్ యాదవ్ వేసిన ఐదో బంతిని కివీస్ సారథి టామ్ లేథమ్ బౌండరీకి మళ్లించాడు. అంతకుముందు మిచెల్ ఒక సింగిల్, రెండు పరుగులు చేశాడు.