సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిడ్నీ టెస్టు(AUSvIND)లో.. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 185 పరుగులకు ఆలౌటైంది. చివర్లో కెప్టెన్ బుమ్రా కొన్ని మెరుపులు మెరిపించాడు. అతను 22 రన్స్ చేసి ఔటయ్యాడు. బుమ్రా ఇన్నింగ్స్లో మూడు బౌండరీలు, ఓ సిక్సర్ ఉన్నాయి. బోలాండ్, కమ్మిన్స్ బౌలింగ్లో బుమ్రా కొన్ని డేరింగ్ షాట్స్ ఆడాడు. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియా మరోసారి తన ఫస్ట్ ఇన్నింగ్స్లో విఫలమైంది. కనీసం 200 రన్స్ కూడా చేయలేకపోయింది.
ఆస్ట్రేలియా స్పీడ్ బౌలర్లు దుమ్ము రేపారు. సిడ్నీ మైదానంలో స్పీడ్ బౌలర్లకే 9 వికెట్లు దక్కాయి. బోలాండ్ 4, స్టార్క్ 3, కమ్మిన్స్ రెండు వికెట్లు తీసుకున్నారు. అంతకముందు టాస్ గెలిచిన ఇండియా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నది. ఇండియన్ టాప్ ఆర్డర్ మరోసారి పేలవ ప్రదర్శన ఇచ్చింది. జైస్వాల్ 10, రాహుల్ 4, గిల్ 20, కోహ్లీ 17, పంత్ 40 రన్స్ చేసి ఔటయ్యారు.
Innings Break!#TeamIndia post 185 in the 1st innings at the Sydney Cricket Ground.
Over to our bowlers.
Live – https://t.co/NFmndHLfxu#AUSvIND pic.twitter.com/1585njVwsn
— BCCI (@BCCI) January 3, 2025
సిడ్నీ టెస్టుకు బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు. ఫామ్లో లేని రోహిత్ శర్మకు రెస్ట్ ఇవ్వడంతో.. ఫాస్ట్ బౌలర్ ఆ రోల్ ప్లే చేస్తున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఒక వికెట్ కోల్పోయి 9 రన్స్ చేసింది. ఖవాజా వికెట్ను బుమ్రా తీశాడు. అతను 2 రన్స్ చేసి ఔటయ్యాడు.