పెర్త్: ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్(AUSvIND) ఫస్ట్ ఇన్నింగ్స్‌లో.. ఇండియా 49.4 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్, నితీశ్ రెడ్డి, కేఎల్ రాహుల్ మాత్రమే ఆసీస్ బౌలర్లను కొంత వరకు ఎదుర్కొన్నారు. అరంగేట్రం మ్యాచ్ ఆడిన నితీశ్ రెడ్డి 41 రన్స్ చేసి ఆఖర్లో ఓట్ అయ్యాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. క్రమక్రమంగా వికెట్లను కోల్పోయింది. ఆసీస్ బౌలర్లు తమ ప్రతాపం చూపించారు. పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.
తొలుత స్టార్క్, హేజల్‌వుడ్ .. తమ బౌలింగ్‌తో భారత బ్యాటర్లను ఇబ్బందిపెట్టారు. ఓపెనర్ జైస్వాల్, పడిక్కల్ డకౌట్ అయ్యారు. కోహ్లీ కొంత సేపు క్రీజ్‌లో ఉన్నా.. 5 పరుగులకే ఔటయ్యాడు. రాహుల్ 26 రన్స్ చేసి వివాదాస్పద రీతిలో నిష్క్రమించాడు. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్ 37, నితీశ్ కుమార్ రెడ్డి 41 రన్స్ చేశారు.
ఫస్ట్ టెస్టు ఆడుతున్న నితీశ్ రెడ్డి.. ఆసీస్ బౌలర్లను సమయోచితంగా ఎదుర్కొన్నాడు. అయితే చివరలో భారీ షాట్ కొట్టబోయి ఔటయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజల్‌వుడ్ 4 వికెట్లు తీసుకోగా, స్టార్క్, కమ్మిన్స్, మార్షలు చెరి రెండేసి వికెట్లు తీసుకున్నారు.
#TeamIndia all out for 150 runs in the first innings of the first Test.
Nitish Kumar Reddy top scores with 41 off 59 deliveries.
Australia innings underway.
Live – https://t.co/gTqS3UPruo… #AUSvIND pic.twitter.com/FuA9ATSQIE
— BCCI (@BCCI) November 22, 2024