ఫ్లోరిడా (అమెరికా): ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. ఆదివారం ఇక్కడ జరిగిన పురుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్లో భారత్ రజతం గెలుచుకుంది. ఫైనల్ పోరులో ధీరజ్, తరుణ్‌దీప్, అతాను దాస్‌తో కూడిన భారత్.. 1-5తో చైనా చేతిలో పరాజయం పాలైంది.
తొలి సెట్లో తలా 54 పాయింట్లతో సమంగా నిలిచినప్పటికీ భారత త్రయం తర్వాత తడబాటుకు గురైంది. ఇదే టోర్నీలో మెన్స్ కాంపౌండ్ విభాగంలో కాంస్య పోరులో బరిలోకి దిగిన అభిషేక్.. స్వల్ప తేడాతో ఓడి పతకం కోల్పోయాడు.