లక్నో: తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు రాణించడంతో ఆస్ట్రేలియా ‘ఏ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత ‘ఏ’ జట్టు విజయం దిశగా సాగుతున్నది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 226 పరుగుల భారీ ఆధిక్యం దక్కించుకున్న ఆసీస్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 185 రన్స్‌కే ఆలౌట్ అయింది. కెప్టెన్ నాథన్ మెక్‌స్వీని (85), ఫిలిప్పీ (50) ఆ జట్టును ఆదుకున్నారు.
బ్రర్ (3/42), సుతార్ (3/50) ఆసీస్‌ను కట్టడిచేయగా సిరాజ్ (2/20), యశ్ ఠాకూర్ (2/29) రాణించారు. 413 పరుగుల భారీ ఛేదనలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత జట్టు.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 169/2తో పటిష్ట స్థితిలో నిలిచింది. కేఎల్ రాహుల్ (74 రిటైర్డ్ హర్ట్), సాయి సుదర్శన్ (44 బ్యాటింగ్), ఎన్ జగదీశన్ (36) ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కున్నారు. భారత జట్టు విజయానికి మరో 243 పరుగులు కావాలి.