బెంగళూరు: దక్షిణాఫ్రికా ‘ఏ’తో బెంగళూరులో జరుగుతున్న అనధికారిక టెస్టులో భారత ‘ఏ’ బ్యాటింగ్ తడబాటుకు గురై తక్కువ స్కోరుకే పరిమితమవడంతో పర్యాటక జట్టుకు కీలక ఆధిక్యం దక్కింది. సౌతాఫ్రికాను 309 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. అనంతరం బ్యాటింగ్కు వచ్చి 58 ఓవర్లలో 234 రన్స్కే కుప్పకూలింది.
అయూశ్ మాత్రె (65) టాప్ స్కోరర్ కాగా బదోని (38), సాయి సుదర్శన్ (32) ఫర్వాలేదనిపించారు. స్వల్ప విరామం తర్వాత జట్టులోకి వచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్ (17)తో పాటు రజత్ (19), పడిక్కల్ (6) విఫలమయ్యారు. సఫారీ బౌలర్లలో సుబ్రయేన్ (5/61) ఐదు వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వచ్చిన సౌతాఫ్రికా.. వికెట్లేమీ నష్టపోకుండా 30 రన్స్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో 75 రన్స్ కలుపుకుని దక్షిణాఫ్రికా 105 పరుగుల ఆధిక్యంలో ఉంది.