India A | మెల్బోర్న్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సన్నాహకంగా జరిగిన రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్ ‘ఏ’ క్లీన్‌స్వీప్ ఎదుర్కొంది. శనివారం ముగిసిన రెండో టెస్టులో ఆసీస్ ‘ఏ’ 6 వికెట్ల తేడాతో భారత్ ‘ఏ’పై ఘన విజయం సాధించింది. నిర్దేశిత లక్ష్యాన్ని(168) ఆసీస్ ‘ఏ’ 4 వికె ట్లు కోల్పోయి ఛేదించింది.
తొలుత ఓవర్‌నైట్ స్కోరు 73/5 రెం డో ఇన్నింగ్స్‌కు దిగిన భారత్ ‘ఏ’ 223 పరుగులు చేసింది. దృవ్ జురెల్(68) అర్ధసెంచరీతో కదంతొక్కాడు.