ODI WC 2023 : వన్డే వరల్డ్ కప్(ODI WC 2023)లో భారత జట్టు(Team India) మ్యాచ్‌ల కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. రేపటి (ఆగస్టు 30) నుంచి టీమిండియా వామప్ మ్యాచ్‌ల టికెట్ల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. టికెట్లు రాత్రి 8 గంటల నుంచి అధికారిక వెబ్సైట్ https://tickets.cricketworldcup.comలో, బుక్‌మైషో(bookmyshow)యాప్‌లో అందుబాటులో ఉంటాయని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మొదటగా గువాహటి, తిరువనంతపురం మ్యాచ్ టికెట్లు అమ్ముతారు.
సెప్టెంబర్ 30న గువాహటి ఇంగ్లండ్‌తో, అక్టోబర్ 3న తిరువనంతపురంలో నెదర్లాండ్స్‌తో భారత జట్టు తలపడనుంది. అక్టోబర్ 14న జరిగే ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లు సెప్టెంబర్ 3న అమ్ముతారు. వారం క్రితమే ఇతర జట్ల వామప్ మ్యాచ్‌ల టికెట్ల అమ్మకాలు మొదలయ్యాయి. అయితే.. బుక్‌మైషో యాప్ మొరాయిస్తుండడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే భారత జట్టు మ్యాచ్‌లకు టికెట్లు దొరుకుతాయా? లేదా? అనే ఆందోళన మరి కొందరు ఉన్నారు.