Australia T20 Debutants : ఆస్ట్రేలియా జట్టు వచ్చే పొట్టి ప్రపంచ కప్(T20 World Cup 2024) పోటీలకు సన్నాహకాలు మొదలు పెట్టింది. అందులో భాగంగా దక్షిణాఫ్రికా(South Africa)తో టీ20 సిరీస్‌కు పవర్ హిట్లర్లు, ఆల్రౌండర్లను ఎంపిక చేసింది. వాళ్లలో ముగ్గురు ఆటగాళ్లు ఈ ఫార్మాట్‌కు కొత్త. ఈ సిరీస్‌తో ఆసీస్ తరఫున ఆ ముగ్గరు టీ20ల్లో అరంగేట్రం చేయనున్నారు. ఓపెనర్ మ్యాట్ షార్ట్(Matt Short), ఆల్‌రౌండర్ అరోన్ హర్డై(Aaron Hardie), స్పెన్సర్ జాన్సన్(Spencer Johnson)లు రేపు తొలి టీ20 మ్యాచ్ ఆడనున్నారు.
విధ్వంసక ఆటగాడైన షార్ట్ ఐపీఎల్ 16వ సీజన్లో పంజాబ్ కింగ్స్(Punjab Kings)కు ఆడాడు. అరోన్, స్పెన్సర్ బిగ్‌బాష్ లీగ్(Big Bash League)లో సత్తా చాటి సెలెక్టర్ల దృష్టిలో పడ్డారు. నాలుగు టీ20 సిరీస్‌లో రేపు తొలి గేమ్ జరుగనుంది. దాంతో, ఆసీస్ తుది జట్టును ప్రకటించింది.
అరోన్ హర్డై, స్పెన్సర్ జాన్సన్, మ్యాట్ షార్ట్
ఆస్ట్రేలియా తొలి టీ20 తుది జట్టు : మ్యాట్ షార్ట్, ట్రావిస్ హెడ్, మిచెల మార్ష్(కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, అరోన్ హర్డై, సీయాన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆడం జంపా, స్పెన్సర్ జాన్సన్.
దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు ఆస్ట్రేలియాకు పెద్ద షాక్ తగిలింది. స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్‌తో పాటు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్(Glenn Maxwel) కూడా గాయపడ్డాడు. శిక్షణా శిబిరంలో మ్యాక్సీ ఎడమ కాలి చీలమండ(Ankle Injury)కు మళ్లీ గాయం అయింది. దాంతో, అతను సిరీస్‌కు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్(Mitchell Marsh) సారథ్యం వహించనున్న విషయం తెలిసిందే. ఇరుజట్ల మధ్య ఆగస్టు 30వ తేదీన మొదటి టీ20 షురూ కానుంది. డేవిడ్ వార్నర్, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్‌లు వన్డే సిరీస్ సమయానికి జట్టుతో కలువనున్నారు.