HS Prannoy | ప్రణయ్ ‘సిక్సర్’.. కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించిన భారత షట్లర్
HS Prannoy : బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ర్యాంకింగ్స్(BWF Rankings)లో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy) సత్తాచాటాడు. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న అతను తాజా ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానం దక్కించుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో లక్ష్యసేన్ 12, కిడాంబి శ్రీకాంత్...
HS Prannoy : బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ర్యాంకింగ్స్(BWF Rankings)లో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy) సత్తాచాటాడు. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న అతను తాజా ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానం దక్కించుకున్నాడు. ప్రణయ్ కెరీర్లో ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం. ఇటీవల ముగిసిన ప్రపంచ బ్యాడింటన్ చాంపియన్‌షిప్(World Badminton Championship)లో కాంస్య నెగ్గిన ప్రణయ్ తన ర్యాంక్ మెరుగుపరుచుకున్నాడు.
నిరుడు డిసెంబర్ నుంచి టాప్-10 కొనసాగుతున్న ప్రణయ్ తాజాగా సిక్సర్ కొట్టాడు. తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి ప్రణయ్ ఒక్కడే టాప్-10లో నిలిచాడు. లక్ష్యసేన్(Lakshya Sen) 12, కిడాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) 20వ ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. వరల్డ్ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ ఒలింపిక్ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్ను మట్టికరిపించాడు. అయితే.. సెమీస్‌లో విదిత్‌సర్న్ చేతిలో పరాజయం పాలై కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. మెగాటోర్నీలో 31 ఏండ్ల ప్రణయ్‌కు ఇదే తొలి పతకం. దాంతో, పురుషుల విభాగంలో వరల్డ్ చాంపియన్‌షిప మెడల్ నెగ్గిన ఐదో భారత షట్లర్‌గా అతను గుర్తింపు సాధించాడు.
సాత్విక్‌సాయిరాజ్- చిరాగ్‌శెట్టి

సింధుకు 14వ ర్యాంక్
గాయం నుంచి కోలుకున్న తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న పీవీ సింధు(PV Sindhu) తాజా ర్యాంకింగ్స్‌లో 14వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే సింధు ఓడి ఇంటి బాట పట్టిన విషయం తెలిసిందే. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్- చిరాగ్‌శెట్టి జోడీ రెండో స్థానాన్ని కాపాడుకుంది. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్ – త్రిసా జాలీ జంట రెండు స్థానాలు ఎగబాకి 17వ ర్యాంక్‌కు చేరింది.
ఇవి కూడా చదవండి
Virat Kohli | అందుకనే వన్డేలంటే ఇష్టం.. కారణం ఏంటో చెప్పిన కోహ్లీ
US Open 2023 | జర్మనీ క్రీడాకారిణికి వింత అనుభవం.. చీటర్.. చీటర్ అంటూ అరిచిన ప్రేక్షకులు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

