IND W Vs IRE W | భారత్-ఐర్లాండ్ వేదికగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్‌లో ఆదివారం రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌తో టీమిండియా వుమెన్స్ జట్టు వైస్ కెప్టెన్ దీప్తి శర్మ అరుదైన ఘనత మైలురాయిని సాధించింది. వంద వన్డేలు, వంద టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది.
ఆల్ రౌండర్ దీప్తి తన కెరీర్లో 1001వ వన్డే మ్యాచ్‌ను ఆదివారం ఆడింది. ఈ మ్యాచ్‌తో ఆమె రికార్డు సృష్టించింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తర్వాత వంద టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 100 వన్డేలు ఆడిన రెండో వుమెన్ క్రికెటర్‌గా నిలిచింది. దీప్తి ఇప్పటివరకు తన కెరీర్లో భారత్ తరపున 124 టీ20 మ్యాచ్‌లు ఆడగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన కెరీర్లో ఇప్పటివరకు 178 టీ20 మ్యాచులు.. 141 వన్డే మ్యాచ్‌లు ఆడింది.
ఈ సందర్భంగా దీప్తి తన క్రికెట్ ప్రయాణంపై మాట్లాడింది. భారత్ తరఫున ఆడాలని కలలు కన్నానని.. టీమిండియాకు ఎంపికైన సమయంలో కంగారుపడ్డానని పేర్కొంది. సీనియర్లంతా కలిసి ఉండాలని అనుకున్నానని.. ఎంత ప్రశాంతంగా.. కంపోజ్‌గా ఉండాలో నేర్చుకున్నానని పేర్కొంది. ఎప్పుడూ బాధ్యతాయుతమైన పాత్ర ఉందని.. తాను ఏ ఆర్డర్‌లోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొంది. 188 పరుగుల ఇన్నింగ్స్ ఆడినప్పుడే అదే నా అతిపెద్ద విజయమని చెప్పింది. క్రికెట్ ఆడుతున్న సమయంలో ఇలాంటిది రికార్డ్ అవుతుందని తాను ఎప్పుడూ అనుకోలేదని తెలిపింది.