IND vs ZIM | టీమిండియాతో మ్యాచ్‌లో పసికూన జింబాబ్వే చివరివరకు పోరాడి ఓడింది. 187 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించలేక చతికిలబడింది. 115 పరుగులకే ఆలౌటైంది. దీంతో జింబాబ్వేపై 71 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇప్పటికే సెమీస్‌లో బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న టీమిండియా.. 8 పాయింట్లతో గ్రూప్-2లో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ (15) నిరాశపరిచినప్పటికీ.. కేఎల్ రాహుల్ (51) హాఫ్ సెంచరీతో మెరిశాడు. విరాట్ కోహ్లీ (26) ఫర్వాలేదనిపించాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ దూకుడు ప్రదర్శించాడు. 25 బంతుల్లోనే 61 పరుగులు సాధించి జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 186 పరుగులు చేసింది. జింబాబ్వేకు 187 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.
భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన జింబాబ్వేకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 9 ఓవర్లు ముగిసేసరికి సగం వికెట్లను కోల్పోయింది. బర్ల్ (35), సికిందర్ రజ్వా (34) జట్టుకు చెప్పుకోదగ్గ స్కోర్‌ను అందించారు. క్రెయిగ్ (13), విలియమ్స్ (11) మినహా ఎవరూ రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. టీమిండియా ప్లేయర్లను జింబాబ్వే ఆటగాళ్లను తట్టుకోలేకపోయారు. పరుగులు చేయడంలో విఫలమయ్యారు. ఫలితంగా 115 పరుగులకే ఆలౌటయ్యారు.
బుధవారం జరిగే తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ తలపడనుంది. గురువారం జరిగే రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌తో టీమిండియా పోరాడనుంది.
PAK vs BAN | సెమీస్‌కు చేరిన పాకిస్థాన్.. బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపు