IND vs SL | వెస్టిండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ఇప్పుడు శ్రీలంకపై కూడా దూకుడు ప్రదర్శిస్తోంది. లఖ్‌నవూ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆటగాళ్లు చెలరేగి ఆడుతున్నారు. సగం (10) ఓవర్లు ముగిసేసరికి ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 98 పరుగులు చేశారు. ఇషాన్ కిషన్ (51), రోహిత్ శర్మ (41) క్రీజులో ఉన్నారు.