బెంగళూరులో జరిగే పింక్‌బాల్ టెస్టు కోసం టీమిండియా రెడీ అవుతోంది. ఈ క్రమంలో శ్రీలంకతో జరిగే ఈ టెస్టులో భారత్ ఫేవరెట్ అని మాజీ ఆటగాడు సాబా కరీమ్ చెప్పాడు. శ్రీలంక బ్యాటింగ్‌లో అనుభవం లేదని, ఏంజెలో మాథ్యూస్‌కు అనుభవం ఉన్నా అతను కొంతకాలంగ పరుగులు చేయలేకపోతున్నాడని అన్నాడు.
మిగతా బ్యాటింగ్ లైనప్ బలంగా లేదని తేల్చేశాడు. అయితే లంక బ్యాటర్లలో చాలా ట్యాలెంట్ ఉందని మాత్రం చెప్పిన ఆయన.. భారత పేస్ బలం ముందు మాత్రం వాళ్లు నిలవలేరన్నాడు. ‘‘ఒక వేళ భారత బౌలర్లు విఫలమైనా కూడా.. వికెట్లు తీసే సత్తా ఉన్న ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. ఇలా భారత్ వద్ద సమర్ధవంతమైన బౌలింగ్ దళం ఉంది. అది రైడా లైట్ల వెలుగులో పింక్ బాల్ టెస్టు బాలు ఆడటం లంక ఆటగాళ్లకు మరింత కష్టంగా ఉంటుంది’’ అని వివరించాడు.
కాగా, ఇప్పటి వరకు భారత్‌లో రెండు పింక్ బాల్ టెస్టులు జరిగాయి. ఇప్పుడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగేది మూడో పింక్ బాల్ టెస్టు. ఇంతకు ముందు జరిగిన రెండు పింక్ బాల్ టెస్టుల్లోనూ భారత జట్టు విజయం సాధించింది.