శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో రోహిత్ శర్మ వ్యూహాలు పక్కా అమలవుతున్నాయి. అతను స్పిన్నర్లను రంగంలోకి దించిన వెంటనే జడేజా, చాహల్ చెరో వికెట్ తీశారు. ఆ తర్వాత బంతి అందుకున్న హర్షల్ కూడా మరో వికెట్ తీశాడు. డ్రింక్స్ బ్రేక్ ముగిసిన వెంటనే బుమ్రాకు బంతి అందించాడు రోహిత్ శర్మ. అతను అనుకున్నట్లే బుమ్రా కూడా సత్తా చాటాడు. అతను వేసిన ఆఫ్ కట్టర్ బంతిని డ్రైవ్ చేయడానికి చండిమాల్ (9) ప్రయత్నించాడు.
కానీ కొంచెం తొందరపడటంతో బంతి షార్ట్ కవర్లోని రోహిత్ శర్మకు క్యాచ్ వచ్చింది. దాన్ని రోహిత్ చక్కగా అందుకోవడంతో చండిమాల్ ఇన్నింగ్స్ ముగిసింది. శ్రీలంక జట్టు 15 ఓవర్లు ముగిసే సరికి 103/4 స్కోరుతో నిలిచింది. ఇప్పటి వరకు జడేజా, చాహల్, హర్షల్ పటేల్, బుమ్రా వికెట్లు తలా ఒక వికెట్ తీసుకున్నారు. ప్రస్తుతం క్రీజులో నిస్సంక (55 నాటౌట్), దాసున్ షానక (9 నాటౌట్) ఉన్నారు.