ఆసియా కప్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక జట్టు మరో వికెట్ కోల్పోయింది. అశ్విన్ వేసిన 14వ ఓవర్లో దనుష్క గుణతిలక అవుటయ్యాడు. అశ్విన్ డెలివరీని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన గుణతిలక రాహుల్కు చిక్కాడు. దీంతో శ్రీలంక జట్టు మూడో వికెట్ కోల్పోయింది. గుణతిలక అవుటవడంతో క్రీజులోకి రాజపక్స వచ్చాడు. అర్ధశతకంతో అదరగొట్టిన మరో ఓపెనర్ కుశాల్ మెండిస్ (57)ను చాహల్ అవుట్ చేశాడు. చాహల్ వేసిన 15వ ఓవర్ తొలి బంతికే ఎల్బీగా అతను పెవిలియన్ చేరాడు. శ్రీలంక రివ్యూ కోరినా ఫలితం మారలేదు. దీంతో శ్రీలంక 15 ఓవర్లలో 120/4 స్కోరుతో నిలిచింది.