IND vs SL : యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ సెంచరీ, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించారు. గిల్ 89 బంతుల్లోనే సెంచరీకి చేరువయ్యాడు. వన్డేల్లో అతనికి ఇది రెండో శతకం. స్వదేశంలో తొలి సెంచరీ సాధించిన గిల్ భావోద్వేగానికి గురయ్యాడు. వంగి నమస్కరిస్తూ ప్రేక్షకులకు అభివాదం చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 పోర్లు , రెండు సిక్సర్లు ఉన్నాయి. రోహిత్ శర్మ(42)తో 95 రన్స్ జోడించిన అతను కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కు 98 పరుగులు జోడించాడు. దాంతో భారత్ భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. రెండో నిరాశపరిచిన స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో క్లాస్ షాట్లతో చెలరేగుతున్నాడు. శుభ్‌మన్ గిల్‌తో కలిసి స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు. ప్రస్తుతం టీమిండియా 31 ఓవర్లు పూర్తయ్యేసరికి 201 రన్స్ చేసింది.