IND vs SL : భారత్ రెండో వికెట్ కోల్పోయింది. మధుషణక బౌలింగ్‌లో రోహిత్ శర్మ (83) కాటన్ బౌల్డ్ అయ్యాడు. 23వ ఓవర్ తొలి బంతిని డిఫెండ్ చేద్దామనుకున్న రోహిత్ బంతి వికెట్లకు తగలడంతో నిరాశగా వెనుదిరిగాడు. 67 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు బాదిన రోహిత్ సెంచరీ చేరువయ్యే క్రమంలో అవుట్ అయ్యాడు. మరోవైపు విరాట్ కోహ్లీ తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. 16 బంతుల్లోనే 3 ఫోర్లతో 24రన్స్ చేశాడు. ప్రస్తుతం భారత్ 24 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 180 రన్స్ స్కోర్ చేసింది. శ్రేయాస్ అయ్యార్ 1తో క్రీజులో ఉన్నాడు
టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ షనక ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత ఆటగాళ్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ బెంచ్‌కే పరిమితం అయ్యారు. ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్, మిడిలార్డర్లో శ్రేయాస్ అయ్యర్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఈ వన్డేలో గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లాలని భారత్ భావిస్తోంది.