IND W Vs SA W | మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో భారత్-దక్షిణాఫ్రికా తొలిసారిగా తలపడబోతున్నాయి. తొలిసారి కొత్త జట్టు ప్రపంచ చాంపియన్‌గా నిలువబోతున్నది. భారత జట్టు సెమీఫైనల్లో ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును ఓడించి చరిత్ర సృష్టించింది. జెమిమా రోడ్రిగ్స్ అజేయ సెంచరీ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంతో భారత్ ఫైనల్‌కు చేరింది. ప్రస్తుతం ఉమెన్ ఇన్ బ్లూ వారి దృష్టిలో చాలా సంవత్సరాల కలగా ఉన్న టైటిల్‌ను సాధించడానికి ఓ అడుగు దగ్గరలో ఉన్నది. అయితే, ఈ మ్యాచ్‌లో వాతావరణం అడ్డంకిగా మారే అవకాశం ఉంది. నవీ ముంబయిలో ఆదివారం వర్షం పడింది. దాంతో టాస్ ఆలస్యమైంది. టాస్ మధ్యాహ్నం 3గంటలకు జరుగనుండగా.. మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానున్నది. అక్యూవెదర్ నివేదిక ప్రకారం.. పగటిపూట వర్షం పడే అవకాశం 63 శాతం ఉంది. ఈ రోజు సాయంత్రం వర్షం పడే అవకాశాలు 40శాతం ఉంది.
దాంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేందుకు 13 నుంచి 8శాతం వరకు ఉంటుందని వెల్లడించింది. రోజంతా వాతావరణం తేమగా, మేఘావృతంగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలు ఉంటుందని అంచనా వేసింది. వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ జరగకపోతే.. టోర్నీ నిబంధనల్లోని సెక్షన్ 13.6 ప్రకారం రిజర్వ్ డే వర్తిస్తుందని ఐసీసీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఆదివారం పూర్తి ఆట జరగకపోతే, పూర్తి ఓటా ఓవర్లు వేయకపోతే నవంబర్ 3న సోమవారం మ్యాచ్ ఆగిపోయిన చోటు నుంచి తిరిగి ప్రారంభమవుతుంది. అయితే, సోమవారం సైతం వర్షం పడే అవకాశాలు 55 శాతం ఉన్నది. ఈ పరిస్థితుల్లో ఓవర్ల సంఖ్యను తగ్గించాల్సి వచ్చినప్పటికీ ఆదివారం మ్యాచ్‌ను పూర్తి చేసేందుకే ఐసీసీ ప్రయత్నించే అవకాశం ఉంది. అయితే, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లా కాకుండా.. మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్ వర్షం కారణంగా రద్దు చేయబడే అవకాశం చాలా తక్కువ. అయితే, వర్షం కొనసాగి రిజర్వ్ డేపై కూడా ప్రభావం పడితే.. భారత్-దక్షిణాఫ్రికా జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.
Read Also :
IND W Vs SA W | భారత్-దక్షిణాఫ్రికా మధ్య వరల్డ్ కప్ టైటిల్ మ్యాచ్..