IND W Vs SA W | ఐసీసీ వుమెన్స్ వన్డే వరల్డ్ కప్లో భాగంగా ఆదివారం భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ జరుగనున్నది. నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో మ్యాచ్ జరుగనున్నది. మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. అరగంట ఆలస్యంగా మొదలుకానున్నది. వర్షం కారణంగా టాస్ ఆలస్యం కానున్నది. మధ్యాహ్నం 3గంటలకు టాస్ జరుగనున్నది. మ్యాచ్లో తొలి బంతి మధ్యాహ్నం 3.30 గంటలకు వేయనున్నారు. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. ఆదివారం నవీ ముంబయిలో వర్షం కురిసింది.
Steady rain 40mins before toss#CWC25 pic.twitter.com/UXyGStkepB
— Vishal Dikshit (@Vishal1686) November 2, 2025
వర్షం ఆగిపోయాక అంపైర్లు స్టేడియాన్ని పరిశీలించి.. అరగంట ఆలస్యంగా మ్యాచ్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అయితే, ఫైనల్ మ్యాచ్కు వాన అంతరాయం కలిగించే అవకాశం ఉన్నది. ఇదిలా ఉండగా.. ఫైనల్ మ్యాచ్ కోసం మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కోసం భారత, దక్షిణాఫ్రికా జట్లు డీవై పాటిల్ స్టేడియానికి చేరుకుంది. వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా ఐసీసీ భారీ ఏర్పాట్లు చేసింది. ప్రముఖ బాలీవుడ్ సింగర్ సునిధి చౌహాన్ సైతం స్టేడియానికి చేరుకుంది. టైటిల్ మ్యాచ్కు ముందు ఆమె తన గాత్రంతో అభిమానులను అలరించనున్నది.