సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్‌కు ఓ మోస్తరు ఆరంభమే లభించింది. రుతురాజ్ గైక్వాడ్ (5), శ్రేయాస్ అయ్యర్ (4) ఇద్దరూ స్వల్ప స్కోర్లకే అవుటవడంతో ఆ భారం మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (27)పై పడింది. అయినా సరే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదిన అతను.. స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే పవర్‌ప్లే ముగిసే సరికి భారత జట్టు 40 పరుగులు చేసింది.
అయితే ఆ తర్వాత ఓవర్ తొలి బంతికే ఇషాన్ కిషన్ పెవిలియన్ చేరడంతో టీమిండియా కష్టాలు రెట్టింపయ్యాయి. నోర్జీ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన కిషన్.. కీపర్ డీకాక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 40 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన భారత జట్టు కష్టాల్లో పడింది.