విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న మూడో టీ20లో సౌతాఫ్రికా జట్టు మరో వికెట్ కోల్పోయింది. అంతకుముందు అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సఫారీ కెప్టెన్ టెంబా బవుమా (8) అవుటయ్యాడు. అతను పెవిలియన్ చేరడంతో డ్వెయిన్ ప్రిటోరియస్ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ వేగం పెంచేందుకు ప్రయత్నించిన రీజా హెండ్రిక్స్ (23)ను హర్షల్ పటేల్ అవుట్ చేశాడు.
పవర్‌ప్లే చివరి ఓవర్ ఐదో బంతికి సిక్సర్ బాదిన హెండ్రిక్స్.. మరో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే స్లో బంతితో అతన్ని బోల్తా కొట్టించిన హర్షల్ అతన్ని అవుట్ చేశాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి సౌతాఫ్రికా జట్టు 2 వికెట్ల నష్టానికి 38 పరుగులతో నిలిచింది.