మూడో టెస్టుపై సఫారీలు పట్టుబిగిస్తున్నారు. కోహ్లీ అవుటైన తర్వాత భారత ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా సాగుతోంది. పంత్‌కు స్వేచ్ఛగా ఆడే అవకాశం లేకపోవడంతో స్కోరుబోర్డు చాలా మందకొడిగా ముందుకుసాగుతోంది. అదే సమయంలో ఆల్‌రౌండర్లు కనీసం బ్యాటింగ్ చేయడం లేదు.
కోహ్లీ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అశ్విన్ (7) అనవసర షాట్‌తో అవుటవగా.. శార్దూల్ ఠాకూర్ (5)ను కూడా ఎన్గిడీ బోల్తా కొట్టించాడు. బంతి లేట్ మూవ్‌మెంట్‌తో శార్దూల్ దెబ్బతిన్నాడు. అతని బ్యాట్‌ను లైట్‌గా తాకిన బంతి వికెట్ కీపర్ వెరీనే చేతుల్లో పడింది. దీంతో భారత జట్టు ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఇక ఉమేష్, షమీ, బుమ్రా మాత్రమే మిగిలారు. వీరి సహకారంతో పంత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాల్సి ఉంటుంది. కానీ సఫారీ పేసర్ల దూకుడు చూస్తే పంత్‌కు ఆ అవకాశం లభించడం కూడా కష్టంగా కనిపిస్తోంది.