మూడో టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టు తడబడుతోంది. రుతురాజ్, ఇషాన్ అద్భుతమైన ఆరంభం అందించినప్పటికీ మిడిలార్డర్ విఫలమైంది. శ్రేయాస్ అయ్యర్ (14) నిరాశ పరిచాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పాండ్యా, పంత్ ఇద్దరికీ చెరో జీవనదానం లభించింది.
తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన రిషభ్ పంత్ (6).. ప్రిటోరియస్ బౌలింగ్లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. గాల్లో ఎత్తుగా లేచిన బంతిని సఫారీ కెప్టెన్ బవుమా పట్టేసుకున్నాడు. ఆ తర్వాత కూడా ఎలాంటి పొరపాటూ జరగకుండా జాగ్రత్త పడటంతో పంత్ పెవిలియన్ బాటపట్టాడు.