టీమిండియా తాత్కాలిక సారధి రిషభ్ పంత్ మరోసారి బ్యాటుతో నిరాశ పరిచాడు. పవర్‌ప్లేలోనే క్రీజులోకి వచ్చిన అతను.. నిలదొక్కుకోవడానికి చాలా సమయం తీసుకున్నప్పటికీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే 23 బంతుల్లో కేవలం 17 పరుగులు చేసి అవుటయ్యాడు.
కేశవ్ మహరాజ్ వేసిన 13వ ఓవర్లో ఆఫ్ సైడ్ వెళ్తున్న బంతిని లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించిన పంత్ విఫలమయ్యాడు. ఈ క్రమంలో టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. షార్ట్ థర్డ్‌మ్యాన్ వద్ద ఉన్న ప్రిటోరియస్‌కు సులభమైన్ క్యాచ్ దక్కింది. దాంతో భారత జట్టు 81 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.