సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్‌గా ఉన్న రిషభ్ పంత్.. బ్యాటుతో రాణించడం లేదు. ఈ విషయంపై పలువురు దిగ్గజాలు ప్రశ్నలు లేవనెత్తారు. మరింత కాలం పంత్ రాణించకపోతే.. జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ క్రమంలో రాజ్‌కోట్ వేదికగా జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్ సన్నాహకాల్లో పంత్ తన బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ సమయంలో కోచ్ రాహుల్ ద్రావిడ్ దగ్గరుండి పంత్‌కు కొన్ని సలహాలు ఇస్తూ కనిపించాడు. అనంతరం తను నేర్చుకున్న విషయాలను బ్యాటింగ్‌లో రిఫ్లెక్ట్ చేయడానికి పంత్ ప్రయత్నించాడు. మిగతా ఆటగాళ్లు కూడా పూర్తి పాజిటివ్ దృక్పథంతో కనిపించారు. ఐపీఎల్ నుంచి బ్యాటింగ్‌లో తడబడుతున్న పంత్.. తన ఫామ్ లేమిని సౌతాఫ్రికా టూర్లో కూడా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
Preps done ✅
All set for the 4⃣th @Paytm #INDvSA T20I at Rajkot. 💪 💪#TeamIndia pic.twitter.com/ZvLAi1qnU3
— BCCI (@BCCI) June 17, 2022