పురాణ గాథల్లోని దేవలోకం నుంచి స్వాతంత్య్రానికి పూర్వం వరకు నాలుగు విభిన్న కాలాల నేపథ్యంలో పునర్జన్మల కథాంశంతో రూపొందిన కన్నడ చిత్రం ‘గత వైభవ’. నవంబర్‌లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం ‘గత వైభవం’ పేరుతో జనవరి 1న తెలుగులో విడుదలకు సిద్ధమవుతున్నది.
ఎస్ఎస్ దుష్యంత్, అషికా రంగనాథ్ జంటగా నటించిన ఈ చిత్రానికి సునీ దర్శకుడు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. పురాణాలు, పునర్జన్మ, చారిత్రక ఘట్టాల కలబోతగా విజువల్ వండర్‌గా మెప్పిస్తుందని మేకర్స్ తెలిపారు.