పాజిటివ్ బజ్ ఓ రేంజ్లో ఉన్న పానిండియా సినిమా ‘పెద్ది’. రామ్‌చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ తుదిదశకు చేరుకున్నది. ఇటీవల ఢిల్లీలో మొదలైన తాజా షెడ్యూల్ విజయవంతంగా పూర్తయిందని చిత్ర సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ తన సోషల్‌మీడియా ద్వారా తెలియజేశారు. పొయెటిక్ ఫీల్‌తో ఉన్న సన్నివేశాలను ఈ షెడ్యూల్లో తాము తీసినట్లు రత్నవేల్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
రామ్‌చరణ్ ఎప్పటిలాగే బెస్ట్ ఇచ్చారంటూ, బుచ్చిబాబుతోపాటు తాను ఉన్న పిక్స్‌ని రత్నవేల్ షేర్ చేశారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్ కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. జగపతిబాబు, దివ్యేందు శర్మ, వి.జి.చంద్రశేఖర్ ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, నిర్మాత: వెంకటసతీశ్ కిలారు, సమర్పణ: మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, నిర్మాణం: వృద్ధి సినిమాస్.