సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత కెప్టెన్ రిషభ్ పంత్‌ను దురదృష్టం వెన్నాడుతోంది. తొలి రెండు మ్యాచుల్లో టాస్ ఓడిన అతను మూడో టీ20లో కూడా టాస్ ఓడిపోయాడు. టాస్ గెలిచిన సౌతాఫ్రికా సారధి టెంబా బవుమా మరో ఆలోచన లేకుండా మరోసారి ఛేజింగ్ ఎంచుకున్నాడు. తాము ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు.
అలాగే తమ జట్టులో ఎలాంటి మార్పులూ లేవని తెలిపాడు. భారత కెప్టెన్ రిషభ్ పంత్ మాట్లాడుతూ తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనే అనుకున్నామని చెప్పాడు. కానీ టాస్ ఓడిన తర్వాత ఏం చేయలేమని, తమ జట్టులో కూడా ఎలాంటి మార్పులూ లేవని వెల్లడించాడు.
భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, ఆవేష్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్
సౌతాఫ్రికా జట్టు: రీజా హెండ్రిక్స్, టెంబా బవుమా (కెప్టెన్), రాసీ వాన్ డర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిక్ క్లాసెన్, డ్వెయిన్ ప్రిటోరియస్, వేన్ పార్నెల్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, ఆన్రిచ్ నోర్జీ, తబ్రయిజ్ షంసీ
A look at the Playing XI for the 3rd #INDvSA T20I
Live – https://t.co/mcqjkC20Hg @Paytm https://t.co/quiGdAuBWZ pic.twitter.com/JdYsukd2Iw
— BCCI (@BCCI) June 14, 2022