సఫారీలతో మూడో టెస్టులో గెలుపే లక్ష్యంగా భారతజట్టు బరిలో దిగుతోంది. గాయంతో రెండో టెస్టుకు దూరమైన విరాట్ కోహ్లీ.. మూడో టెస్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. విహారి స్థానంలో తాను వచ్చినట్లు వెల్లడించాడు. అలాగే గాయం కారణంగా సిరాజ్ ఆడటం లేదని, అతని స్థానంలో ఉమేశ్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నామని తెలియజేశాడు.
ఇషాంత్, ఉమేశ్‌లలో ఎవరిని తీసుకోవాలని చాలా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. ఉమేశ్ ఇటీవలి కాలంలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని, భారత జట్టుకు బలమైన బెంజ్ సామర్ధ్యం ఉందని కొనియాడాడు. అదే సమయంలో ఇది తమకు చాలా చాలా ముఖ్యమైన మ్యాచ్ అని సఫారీ కెప్టెన్ డీన్ ఎల్గార్ అన్నాడు. అంతకుముందు కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ గత 10-15 ఏళ్లలో ఇది తమకు అత్యంత కీలకమైన మ్యాచ్ అని అభిప్రాయపడ్డాడు.
భారతజట్టు: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్
సౌతాఫ్రికా: డీన్ ఎల్గార్, ఎయిడెన్ మార్క్రమ్, కీగన్ పీటర్సన్, రాసీ వాన్ డర్ డస్సెన్, టెంబా బవుమా, కైల్ వేరెన్నె, మార్కో జాన్సెన్, కగిసో రబాడ, కేశవ్ మహరాజ్, డువాన్నె ఆలివియర్, లుంగి ఎన్గిడీ.
A look at #TeamIndia's Playing XI for the third Test 🔽
— BCCI (@BCCI) January 11, 2022
Follow the game here – https://t.co/rr2tvBaCml #SAvIND pic.twitter.com/7Z8Ms8a82w
🚨 Toss Update from Cape Town 🚨
— BCCI (@BCCI) January 11, 2022
Virat Kohli has won the toss & #TeamIndia have elected to bat against South Africa in the third #SAvIND Test.
Follow the match ▶️ https://t.co/rr2tvBaCml pic.twitter.com/d4pwOM8OyF