భారత్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు టాస్ గెలిచింది. ఒంట్లో బాగలేకపోవడంతో ఈ మ్యాచ్‌కు సఫారీ కెప్టెన్ టెంబా బవుమా దూరమయ్యాడు. అతని స్థానంలో కేశవ్ మహరాజ్ సారధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో టాస్ గెలిచిన కేశవ్ మహరాజ్ తాము ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు.
తమ జట్టులో బవుమా, తబ్రయిజ్ షంసీ, లుంగి ఎన్గిడీ ముగ్గురూ ఆడటం లేదన్నాడు. వారి స్థానాల్లో బ్యోర్న్ ఫోర్టూయిన్, రీజా హెండ్రిక్స్, ఆన్రిచ్ నోర్యీ ఆడుతున్నట్లు వెల్లడించాడు. ఈ సందర్భంగా టీమిండియాలో కూడా రెండు మార్పులు చేసినట్లు కెప్టెన్ శిఖర్ ధవన్ తెలిపాడు. రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయి ఆడటం లేదని చెప్పిన ధవన్.. వారి స్థానంలో వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్‌ను తీసుకున్నట్లు చెప్పాడు. భారత జట్టులో షాబాజ్‌కు ఇదే అరంగేట్ర మ్యాచ్ కావడం గమనార్హం.
భారత జట్టు: శిఖర్ ధవన్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఆవేష్ ఖాన్, మహమ్మద్ సిరాజ్
సౌతాఫ్రికా జట్టు: జానెమన్ మలన్, క్వింటన్ డీకాక్, రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిక్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, బ్యోర్న్ ఫోర్టూయిన్, కేశవ్ మహరాజ్ (కెప్టెన్), కగిసో రబాడ, ఆన్రిచ్ నోర్యీ
🇮🇳🏏 BOWLING FIRST! Sundar and Shahbaz come in for Ruturaj and Bishnoi.
👏 Shahbaz is making his international debut today. Good luck to him!
📸 Getty • #INDvSA #INDvsSA #SAvIND #TeamIndia #BharatArmy pic.twitter.com/uSO2DHAng1
— The Bharat Army (@thebharatarmy) October 9, 2022
🎥 A moment to cherish for Shahbaz Ahmed as he makes his debut in international cricket. 👏 👏
Go well! 👍 👍
Follow the match ▶️ https://t.co/6pFItKAJW7 #TeamIndia | #INDvSA pic.twitter.com/Jn9uU5fYXc
— BCCI (@BCCI) October 9, 2022