సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో భారత జట్టుకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. అద్భుతంగా ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ (57) పెవిలియన్ చేరాడు. ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడిన గైక్వాడ్.. 30 బంతుల్లో తన తొలి అంతర్జాతీయ అర్ధశతకం నమోదు చేశాడు. ఆ తర్వాత కాసేపటికే కేశవ్ మహరాజ్ వేసిన 10వ ఓవర్ చివరి బంతికి అవుటయ్యాడు.
మహరాజ్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన రుతురాజ్.. దాన్ని నేరుగా కొట్టాడు. తనవైపు వచ్చిన బంతిని డైవ్ చేస్తూ అద్భుతంగా మహరాజ్ అందుకోవడంతో రుతురాజ్ పెవిలియన్ బాటపట్టాడు. అతను అవుటవడంతో శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు.