సఫారీలతో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (26)ను జాన్సెన్ అవుట్ చేశాడు. డ్రింక్స్ బ్ేక్ తర్వాత తొలి బంతికే మయాంక్ అవుటయ్యాడు. ఆఫ్ వికెట్ ఆవల పడిన బంతిని డ్రైవ్ చేయడానికి మయాంక్ ప్రయత్నించాడు.
ఈ క్రమంలో అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతిని వికెట్ కీపర్ వెరెనె అందుకున్నాడు. దీంతో భారత ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు ఉన్నాయంటేనే ఎలా ఆడాడో తెలుస్తుంది. మయాంక్ అవుటవడంతో పుజారా క్రీజులోకి వచ్చాడు.
సెంచూరియన్‌లో జరిగిన మ్యాచ్‌లో పుజారా తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. కాగా, వీపు నొప్పి కారణంగా టెస్టు కెప్టెన్ కోహ్లీ.. రెండో టెస్టుకు దూరమైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 98 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. ఈ సిరిస్ మూడో టెస్టుతో వంద టెస్టు మ్యాచ్‌లు పూర్తి చేసుకోవలసింది. కానీ ఈ మ్యాచ్ మిస్ అవడంతో వచ్చే టెస్టు సిరీస్ వరకూ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
1st wicket of the Test match, taken by Marco Jansen!!
— OneCricket (@OneCricketApp) January 3, 2022
He breaks the opening partnership, seeing the back of Mayank Agarwal. #SAvIND #INDvsSA #KLRahul #2ndTest #RahulDravid #ViratKohlipic.twitter.com/jlmBMvFNyj