సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత జట్టు తడబడుతోంది. తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో సత్తాచాటలేకపోతున్నారు. ఇషాన్ కిషన్ (34), శ్రేయాస్ అయ్యర్ (40) మినహా మిగతా ఎవరూ రాణించలేదు. రుతురాజ్ గైక్వాడ్ (1) తొలి ఓవర్లోనే పెవిలియన్ చేరగా.. కెప్టెన్ పంత్ (5) తీవ్రంగా నిరాశ పరిచాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా (9) కూడా విఫలమయ్యాడు. పార్నెల్ వేసిన బంతిని సరిగా జడ్జ్ చేయలేకపోవడంతో.. లెగ్ స్టంప్‌ను కూల్చిందా బంతి. దాంతో పాండ్యా నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు. ఆ మరుసటి ఓవర్లోనే శ్రేయాస్ అయ్యర్ కూడా అవుటయ్యాడు.
ఆఫ్ స్టంప్ ఆవలగా ప్రిటోరియస్ వేసిన షార్ట్ డెలివరీని ఆడేందుకు ప్రయత్నించిన అతను.. పూర్తిగా విఫలమయ్యాడు. దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ వైపు వెళ్లింది. కీపర్ క్లాసెన్ దాన్ని సులభంగా అందుకోవడంతో శ్రేయాస్ పెవిలియన్ బాటపట్టాడు. ప్రస్తుతం భారత జట్టు 14 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 99 పరుగులతో నిలిచింది.