IND Vs SA Test | భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు తొలి సెషన్ ముగిసింది. తొలి సెషన్లో దక్షిణాఫ్రికా పూర్తిగా ఆధిపత్యం బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగించారు. దక్షిణాఫ్రికా జట్టు భారీ స్కోర్ దిశగా కదులుతున్నది. అయితే, రెండోరోజు తొలి సెషన్లో భారత బౌలర్లు ఒక్క వికెట్‌ను కూడా సాధించలేకపోయారు. టీ బ్రేక్ సమయానికి దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. ప్రస్తుతం ముత్తుస్వామి 56, వెర్రీన్ 38 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇద్దరు కలిసి ఏడో వికెట్‌కు 70 పరుగులు జోడించారు.
గౌహతి వేదికగా సాగుతున్న టెస్టులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రెండు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే భారత జట్టు 0-1 తేడాతో వెనుకపడింది. ఈ టెస్టును గెలిచి ఎలాగైనా సిరీస్‌ను డ్రా చేయాలని భారత జట్టు భావిస్తున్నారు. గిల్ స్థానంలో సాయి సుదర్శన్, అక్షర్ పటేల్‌కు బదులుగా ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్‌రెడ్డి జట్టులోకి వచ్చారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు తొలిరోజు 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేశారు. ట్రిస్టన్ స్టబ్స్(49), కెప్టెన్ తెంబా బవుమా(41), మార్కరమ్ (38), రికల్టన్ (35) పరుగులతో రాణించారు. స్పిన్నర్ కుల్దీప్యాదవ్ (3/48) మూడు వికెట్లతో అదరగొట్టగా బుమ్రా(1/38), సిరాజ్(1/59), జడేజా(1/30) ఒక్కో వికెట్ తీశారు.