ICC Rating on Newlands Pitch : భారత్ – దక్షిణాఫ్రికా మధ్య ఇటీవలే కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ వేదికగా రెండురోజుల్లోనే ముగిసిన టెస్టుకు వాడిన పిచ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా స్పందించింది. ఈ పిచ్‌కు ఐసీసీ ‘సంతృప్తికరంగా లేదు’ (unsatisfactory) అంటూ రేటింగ్ ఇచ్చింది. బౌలర్లకు అత్యంత అనుకూలంగా బ్యాటర్లకు చుక్కలు చూపించిన పిచ్‌పై ఐసీసీ అంసతృప్తి వ్యక్తం చేసింది. న్యూలాండ్స్ పిచ్‌కు పూర్ రేటింగ్‌తో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చింది.
ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక పిచ్ (వేదిక) కు ఆరు డీమెరిట్ పాయింట్లు గనక వస్తే ఆ పిచ్‌ను ఏడాది పాటు నిషేధం విధిస్తారు. అంటే ఆ వేదికలో ఏడాదిపాటు ఎటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లు జరుగవు. న్యూలాండ్స్ పిచ్‌పై ఐసీసీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ స్పందిస్తూ… ‘న్యూలాండ్స్ పిచ్ బ్యాటింగ్ చేసేందుకు చాలా కష్టంగా ఉంది.. ఈ పిచ్‌పై బంతి త్వరగా బౌన్స్ అవుతుంది. మ్యాచ్ మొత్తం ఇదే పరిస్థితి కనిపించింది. బ్యాటర్లకు షాట్స్ ఆడేందుకు పిచ్ ఏమాత్రం అనుకూలంగా లేదు. మ్యాచ్‌లో కొంతమంది బ్యాటర్ల గ్లవ్స్‌కు కూడా బౌన్స్ అయిన బంతులు బలంగా తాకాయి. అనూహ్యమైన బౌన్స్ కారణంగా పలువురు బ్యాటర్లు వికెట్ సమర్పించుకున్నారు..’ అని తన రిపోర్టులో పేర్కొన్నాడు.
The recently concluded shortest-ever Test in Cape Town has received an ICC pitch rating 👀#WTC25 | #SAvINDhttps://t.co/rkK47P8Y58
— ICC (@ICC) January 9, 2024
642 బంతుల్లోనే ముగిసిన ఈ టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీ జట్టు.. 55 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 153 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఆట తొలిరోజే బౌలర్లు ఏకంగా 23 వికెట్లు పడగొట్టారు. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 176 పరుగులు చేయగా లక్ష్యాన్ని (79) భారత్.. మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.