Shubman Gill | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్-పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్ ఇరుజట్లకు కీలకం. దాంతో మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని ఇరుజట్లు కసిగా ఉన్నాయి. మ్యాచ్‌కు ముందు టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ విలేకరులతో మాట్లాడారు. మ్యాచ్‌కు సన్నాహాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దుబాయిలో మంచు కురిసే అవకాశం లేదని.. బ్యాటింగ్ చేస్తున్న జట్టుపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని.. 300 కంటే ఎక్కువ పరుగులు చేస్తేనే విజయ అవకాశాలుంటాయని చెప్పుకొచ్చారు.
భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. ఐసీసీ టోర్నీలో పాక్‌పై భారత్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌పై చాలా హైప్ ఉన్నది. ఈ క్రమంలో మ్యాచ్‌పై గిల్ మాట్లాడుతూ.. తాము సానుకూలంగా, దూకుడుగా క్రికెట్ ఆడుతామని తెలిపాడు. దుబాయి వికెట్‌పై 300 నుంచి 305 స్కోర్ సాధిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ బాగా చేసే జట్టుకు గెలిచే అవకాశం ఉంటుందని తెలిపాడు. మంచు కురవకపోవడంతో టాస్ విషయంలో పెద్దగా పట్టింపు లేదని.. అయితే, తర్వాత బ్యాటింగ్ చేసే జట్టుపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని చెప్పుకొచ్చారు.
భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై హైప్ ఉందా? అన్న ప్రశ్నకు వైస్ కెప్టెన్ దానిపై తనకు అవగాహన లేదని చెప్పాడు. రెండు జట్ల మధ్య పోటీకి చాలా చరిత్ర ఉందని.. మ్యాచ్‌ను చూసేందుకు కోట్లాది మంది ఇష్టపడతారని చెప్పాడు. కాబట్టి ఓవర్ హైప్ ఉందా? లేదా? అన్నదానిపై తానేమీ చెప్పలేనన్నారు. భారత్, పాక్ మధ్య మ్యాచ్ కీలమైందని.. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ దానికంటే ముఖ్యమందని చెప్పాడు. తాము మంచి క్రికెట్ ఆడుతున్నామని.. పాకిస్తాన్‌ను అంత తేలిగ్గా తీసుకోలేమని చెప్పాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం తనపై ఎలాంటి ప్రభావం చూపదని గిల్ పేర్కొన్నాడు. తన శైలి రోహిత్‌కు భిన్నంగా ఉంటుందని చెప్పాడు. తనను తాను మెరుగుపరుచుకునేందుకు ఇదో అవకాశంగా భావిస్తున్నానని చెప్పాడు. రోహిత్ భాయ్‌తో బ్యాటింగ్ చేయడం చాలా బాగుందని.. తన బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తానని చెప్పుకొచ్చాడు. కెప్టెన్ దూకుడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తే అది మ్యాచ్‌కు సర్దుబాటు చేసుకునేందుకు తనకు అవకాశం ఇస్తుందని తెలిపాడు.
చాంపియన్స్ ట్రోఫీలో స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే ఆడుతుందని.. అతని లేకపోవడం జట్టుకు ఎదురుదెబ్బ అని పేర్కొన్నాడు. బుమ్రా లేకపోవడం మమ్మల్ని ప్రభావితం చేస్తోందని స్పష్టంగా తెలుస్తుంది. బుమ్రా చాలా కాలంగా భారతదేశం తరఫున ఆడుతున్నాడని.. బుమ్రా లేకపోవడం తమకు ఎదురుదెబ్బ అని పేర్కొన్నాడు. తాము ఓ జట్టుగా తాను నిరాశ చెందామని.. ఉన్న దాంట్లోనే బెస్ట్‌ని ఎంపిక చేసుకోవాలని.. హర్షిత్ రాణా బౌలింగ్ బాగానే చేస్తున్నాడని గిల్ వివరించాడు.